Home Blogs పితృదోషం అంటే అసలు ఏమిటి ? రెండవ భాగం

పితృదోషం అంటే అసలు ఏమిటి ? రెండవ భాగం

by gargeyaastro

పొన్నలూరి శ్రీనివాస గార్గేయ
9348632385

జన్మ లగ్నం నుంచి నవమ స్థానాన్ని పితృ స్తానం అని అంటారు .అనగా తండ్రి స్థానము. పితృ కారక గ్రహం రవి . ఈ రవి కి శని రాహువు కేతువు శత్రువులు . శని రాహు కేతువులలో ఏ ఒక్క గ్రహం అయినను….. నవమ స్థానము లో ఉన్నచో పితృదోషం వచ్చును పితృ స్థానాన్ని భాగ్య స్తానము లేదా అదృష్ట స్థానమని కూడా పిలుస్తారు .

పితృ కారక గ్రహం రవి ,ఈ రవి కి శని రాహువు కేతువు శత్రువులు .జాతక చక్రం లో రవి ఏ స్తానం లో ఉన్నను ,రవి తో పాటు ఏ ఒక్క శత్రువు కలిసినచో……. రవి బలహీనుడు అయి పితృదోషానికి లోనగును .ఎప్పుడైతే రవి బలహీనుడు అగునో ,వెంటనే అదృష్టస్థాన ఉనికి తగ్గును .అనగా అదృష్టస్థానము కూడా బలహీనపడును
ఈ పితృదోషాలలో అనేక వందల కొద్ధి కాంబినేషనలు ఉన్నవి .ఇందులో ముఖ్యంగా కొన్ని కాంబినేషన్ లు గమనించండి

1 .లగ్నం నుంచి నవమ స్తానంగా చెప్పబడే అదృష్ట స్థాన అధిపతి ఏ గ్రహం అయితే ఉండునో ,ఆ గ్రహం జాతక చక్రం లో ఏ స్తానంలో నైన రాహువు తో కలిస్తే పితృదోషం ఏర్పడును .ఉదాహరణ కు మేష లగ్నానికి ,కర్కాటక లగ్నానికి గమనిద్దాం .ఈ రెండు లగ్నాలకు అదృష్టస్థాన అధిపతి శుభగ్రహ గురువు .ఇట్టి గురువు జాతక చక్రం లో ఏ స్తానంలో రాహువు తో కలిసినా పితృదోషమని భావించాలి .అయితే గురువు రాహువుల కలయికను గురుఛండాలయోగం అంటారు .ఇక్కడ ఒకవైపు గురుఛండాలయోగం తో పటు పితృదోషం కూడా ఏర్పడింది అలాగే మరో ఉదాహరణ తీసుకుంటే…. ధనుర్లగ్నానికి నవమ స్తానంగా ఉండే అదృష్టస్థానమే సింహరాశి .ఈ స్తానంలో ఒకవేళ గురువు రాహువు ఉన్నారనుకుందాం ఇప్పుడు మూడు దోషాలు ఏర్పడినవి మొదటిది గురురాహువుల కలయికచే గురుఛండాలయోగం కాగా ,రెండవది నవమ స్థాన రాహువు వలన పితృదోషం కాగా ,3వ ది సింహ గురు దోష0.ఈ 3 దోషాలకు వ వ్యతిరేకతలు ఉంటాయి

2. అలాగే కన్యాలగ్నO ,కుంభ లగ్నాలకు నవమ స్థానానికి అధిపతి శుక్రుడు .ఈ శుక్రుడు జాతక చక్రంలో ఎక్కడైనా రాహువు తో కలిస్తే పితృ దోషం వచ్చును .శుక్ర రాహువుల కలయికే ఒక దోషం కాగా…… ఈ రెండు లగ్నాలకు పితృ దోషం కూడా అదనంగా ఉంది .

పైన చెప్పిన లగ్నాలకు రవితో సంబంధం ఎక్కడా లేనేలేదు కాని పితృ దోషాలేర్పడినవి .అసలు పితృ దోషం అనగానే తండ్రి పాపాలు చేసినందున ,మరణించిన వారి ఆత్మలు శాంతించనందున పితృ దోషాలు వస్తుంటాయని అందరు భావిస్తారు. పితృ దోషం అనగానే భయపడి ఆందోళన చెందుతారు . నిజానికి చెప్పాలంటే నూటికి 5% మాత్రమే మరణించిన వారి నుంచి దోషాలు వస్తుంటాయి . మిగిలిన 95%మాత్రం కేవలం అదృష్టస్థానం దెబ్బతిన్న కారణంగా వస్తుంటాయని భావించాలి.

అదృష్టస్థానం దెబ్బతిన్న కారణంగానే సమస్యలనేవి చిన్న వయసు నుంచే ప్రారంభం అవుతుంటాయి . జరుగుతున్న దశలతో సంబంధం లేకుండానే సమస్యలు వెన్నంటి ఉంటాయి . అర్దాష్టమ, అష్టమ ,ఏలినాటి శని జరిగే సమయాల్లో ఎవరికయితే అదృష్ట స్థాన దోషాలు ఉంటాయో ,వారికీ మాత్రం సమస్యల ప్రభావం తీవ్రంగా ఉండును .

అదృష్టస్థాన దోషం ఉన్నందున కెరిర్ సజావుగా సాగకపోవటం ,విద్యలో వైఫల్యాలు ,ఉద్యోగ సమస్యలు,వ్యాపారాలు దెబ్బతినటం ,రుణ భారం పెరగటం వివాహ వైఫల్యాలు, ఆలస్య వివాహాలు ,దంపతుల మధ్య కలహాలు ,వయసు 50 దాటినను వివాహం కాకుండా ఉండటం ,సోదరీ సోదరుల మధ్య ఘర్షణలు ,కళత్రవియోగము ,ఆస్థి తగాదాలు ,శతృవృద్ది ,గర్భశోకములు ,అవకాశాలు చేజారిపోవటం ,అపకీర్తి ,కారాగారవాసము ,తల్లి తండ్రులను కోల్పోవటము మరియు దూరం కావటము ,అశాంతి వాతావరణం ,మోసానికి గురికావటం ,కుటుంబం నుండి విడిపోవటము ,నిత్య దారిద్రియము ,సంతానలేమి,సంతానం ప్రయోజకులు కాకపోవటం ,వ్యసనాలు ,నిరుద్యోగము, అకాల మరణములు ,వాహన ప్రమాదములు ,మనో బుద్ధి వైకల్యాలు …….ఈ విధంగా ఎన్నో ఎన్నెనో సమస్యలనేవి వెంటాడుతుంటాయి ఇవన్నీ కూడా లగ్నం నుంచి నవమ స్తానమనే అదృష్ట స్తానం దెబ్బతిన్న కారణంగా వచ్చే సమస్యలని గ్రహించాలి .

కనుక లగ్నం నుంచి నవమ స్థానంలో ఏర్పడే అదృష్ట దోషాలకు చెందిన కాంబినేషన్ లు వందలకొద్దీ వున్నాయి .వీటిలో 5%మాత్రమే మరణించిన వారి నుంచి దోషాలు వస్తుంటాయి.
నవమ స్తానం లో దోషం కనపడగానే ,వాస్తవాలు తెలుసుకుని తగిన రీతిలోనే పరిహారాలు పాటించాలి .నవమ స్తానం ఎంత బలీయంగా ఉంటేనే …జీవితం లో విశేషంగా యోగాలను పొందగలరు .పరిహారాలు పాటించిన రాత్రి కి రాత్రే అనుకూలతలు రావు .పై దోషాలు తొలగుటకు దీర్ఘకాల పరిహారాలు ఆచరించాలి .

ప్రస్తుత రోజులలో పితృ దోషమనగానే నారాయణ నాగబలి అనే శాంతి కార్యక్రమం జరిపించండని కొందరు చెబుతుంటారు .నిజానికి నారాయణ నాగబలి కార్యక్రమాన్ని ఎవరికి చేయించాలి ? ఎవరికి చేయకూడదనే విచక్షణ కూడా తెలుసుకోవాలి. దీనితో పాటు పితృ దోషాలనబడే అదృష్ట దోషాలకు తెలిసి తెలియకుండా ఆశ్లేష బలి కూడా చేస్తుంటారు .అసలు ఆశ్లేష బలి అనగా ఏమిటి ? అదృష్ట దోషాలకు ,ఆశ్లేషబలికి ఉన్న సంబంధం ఏమిటో …..

అనేక ఆసక్తికర అంశాలు అన్నిటిని మూడవభాగంలో తెలుసుకుందాం

పొన్నలూరి శ్రీనివాస గార్గేయ
9348632385 {భారత ప్రభుత్వ ఆమోదిత దృగణిత పంచాంగకర్త హైదరాబాద్ }

You may also like

2 comments

Avatar
Chamundeshwari July 8, 2023 - 6:03 am

Thank u guru garu for telling important of lalitha trishati and as a remedy 🙏 ❤

Reply
Avatar
gargeyaastro October 29, 2024 - 11:07 am

subham

Reply

Leave a Comment