శ్రీనివాస గార్గేయ 8341132385
ప్రతీ వ్యక్తి జన్మ జాతకంలో అనేక దోషాలు ఉంటుంటాయి..
ముఖ్యంగా లగ్నం నుంచి 1, 4, 9,10 స్థానాల ద్వారా గత జన్మలో చేసిన పుణ్య కార్యాల పుణ్య ఫలితాలను ఈ జన్మలో అనుభవించగలరు. అలాగే లగ్నం నుంచి 3, 6, 8, 12 స్థానాలను బట్టి గత జన్మలో చేసిన పాప కార్యాల పాపపు ఫలితాలను ఈ జన్మ లో అనుభవిస్తారు. ఈ విధంగా గత జన్మనుంచి వెంట తెచ్చుకునే పుణ్య పాప కర్మలను సంచిత కర్మలు అంటారు.
జాతకాలలో 1,4,9,10 స్థానాల ద్వారా పుణ్య కర్మ ఫలితాలు ఈ జన్మ లో అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ, అటువంటి వారలకు తమ తమ జాతకాలలో ఇతర వ్యతిరేక గ్రహాస్థితులు వున్నపుడు… ఈ జన్మ లో తాము అనుభవించాల్సిన పుణ్య ఫలితాలను ఈ జన్మలో అనుభవించలేరు..
అలాగే 3, 6 8,12 స్థానాల ద్వారా ఏమైనా పాపకార్యాల, పాపపు ఫలితాలు ఈ జన్మ లో రావాల్సిండగ….. అదృష్టవశాత్తు ఏవైనా శుభ గ్రహస్థితిగతులు ఉన్నపుడు…. ఈ జన్మలో వ్యతిరేకతలు, సమస్యలకు బదులుగా….. చక్కని అనుకూల ఫలితాలను పొందగలరు. కనుక వ్యక్తుల జాతకాలలో పుణ్య కార్య ఫలితాలు ఉండి కూడా….ఈ జన్మ లో సమస్యలు ఎదుర్కుంటారు … అలాగే పాపఫలితాలకు బదులుగా శుభఫలితాలు ఈ జన్మలో పొందుతుంటారు…. దీనికి కారణమేమనగా వారి వారి జాతకాలలో గ్రహసంచార స్థితిగతులని భావించాలి..
పై ప్రకారంగా గత జన్మ నుంచి వచ్చిన సంచిత కర్మలను ఈ జన్మలో అనుభవిస్తుంటారు… ఇక వీరి జాతకాలలో పితృదోషాలు, ప్రారబ్దదోషాలు, నాగదోషాలు, కారకోభావనాశాయ ( వివాహలు దెబ్బతినటము), అశ్రేషబలి, మొదలైన అనేక దోషాలతో మగ్గుతుంటారు… కనుక వారి వారి జాతక స్థితిగతులను బట్టి…. గత జన్మ పాప పుణ్యలను బట్టి, ఈ జన్మలో ఉన్న జాతక స్థితులను బట్టి…. సమస్యలను ఎదుర్కునే వారు వుంటారు, అనుకూలతను పొందేవారు వుంటారు…ఇలాంటి పరిస్థితులలో కొందరికి ఉద్యోగ, వ్యాపార, ఆర్ధిక, కుటుంబ, మానసిక, శారీరక, వివాహ, సంతాన, లాభ అంశాలలో పూర్తిగా వ్యతిరేకతలను పొందేవారు వుంటారు… జీవితకాలం సమస్యలతో బాధపడుతూ…. ఈ జన్మను ముగించి…. పై జన్మకు ఈ కర్మలను మోసుకుని వెళ్తారు… ఇలాంటి కర్మలనే ఆగామి కర్మలు అంటారు..
కనుక ప్రతీవ్యక్తి జాతకంలో ఉండే ప్రతికూల అంశాలను బట్టి తగిన రీతిలో పరిహార శాంతుల కొరకుగా 11నెలల పాటు జరిగే 97రోజుల ప్రత్యేక శాంతి క్రతువుల ద్వారా కొంత ఉపశాంతి మార్గాన్ని పొందవచ్చు.
ముఖ్యంగా ప్రతి సంవత్సరం వచ్చే భాద్రపదమాసం మహాలయ పక్షాలలో…. వారి వారి కుటుంబంలో మరణించిన వారికి పితృ కార్యములు, తర్పణ కార్యములు ఆచరిస్తుంటారు. ఈ విధంగా పితృకార్యాలు, తర్పణ కార్యాలు ఆచరించటం ఎంతో విశిష్టదాయకం. ఇలా ఆచరించే వారి జాతకాలలో …. ఎవరికైనా పితృదోషాలు వున్నచో…. వారు చేసిన పితృ కార్యాల వలన తమకున్న పితృదోషాలు వెళ్ళిపోతాయని అనుకోరాదు. మరణించిన వారికి చేపట్టే కార్యాలకు…..పితృదోషాల నివారణ కొరకుగా చేసే కార్యాలకు చాలా చాలా వ్యత్యాసం వున్నదని గమనించాలి..
పితృదోషాలున్నవారు, లేనివారు కూడా 97రోజులపాటు జరిగే కార్యాలను జీవితంలో ఒకసారి ఆచరిస్తే సరిపోతుంది…. ప్రతిసoవత్సరం మరణించినవారి కొరకుగా చేసే పితృకార్యాలు (తద్దినాలు )ప్రతి సంవత్సరం చేస్తూనే ఉండాలి. కనుక ఈ వ్యత్యాసాన్ని గమనించాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీనివాస గార్గేయగారి అభిమానుల అభ్యర్ధన మేరకు, దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ గారి ఆధ్వర్యంలో ఈ 97రోజుల శాంతి పరిహార క్రతువులకు శ్రీకారం జరిగింది. ప్రతీ తెలుగు మాసంలో పూర్ణిమ నుంచి అమావాస్య మధ్యగల 15రోజులలో 9 రోజులు మాత్రమే కార్యక్రమాలు జరుగును.9వ రోజు అమావాస్యగా ఉండును. ఒకవేళ ఆ అమావాస్య సోమవారం వస్తే ఆ నెలలో 9 రోజులకు బదులుగా 8 రోజులే కార్యక్రమం జరుగును. అందుకే ఈ 2023 కార్తికమాసం నుంచి రాబోయే 2024 భాద్రపధమాసం వరకు మొత్తం 11నెలలో 99రోజులు పరిహార క్రతువులు జరగవలసి వున్నది… కానీ 2024 లో ఫాల్గుణ మాసం మరియు శ్రావణ మాసంలలో అమావాస్య తిధి సోమవారం వచ్చినందున ఆ రెండు నెలలో 8రోజులే జరుగును.అనగా ఒక్కో నెలకు 9 రోజుల చెప్పున 11 నెలలకు 99 రోజులు జరగవలసి ఉండగా…..ఫాల్గుణ శ్రావణలలలో సోమవారం అమావాస్య వచ్చినందున 97రోజులుగా కార్యక్రమాలు జరుగును.
2023 డిసెంబర్ 4నుంచి శాంతి పరిహార కార్యక్రమములు ప్రారంభమై 2024 అక్టోబర్ 2 మహాలయ అమావాస్య తో ముగిసిపోవును.
ఎవరెవరి జాతకాలలో పితృదోషాలు,( ఈ పితృ దోషాల్లో వందలకొద్ది కాంబినేషన్లు ఉన్నవి )నాగ దోషాలు, ప్రారబ్దదోషం, ఆశ్రేషబలి , గురుచండాలయోగం, వివాహ సంబంధిత దోషాలు, శుక్రగ్రహ, గురుగ్రహ బలహీన దోషాలు, అభివృద్ధిని కాలరాసే దోషాలతో పాటు అనేకానేక దోషాలన్ని ఉన్న వారందరికీ అనుకూలంగా ఉండే రుసుముతో ఈ 97రోజుల బృహత్తర కార్యక్రమం జరగబోతున్నది. మీరు కూడా చేరి మీకున్న దోషాలు ఉపశమించుకునాలంటే…
శ్రీనివాస గార్గేయ
8341132385
2 comments
Guruji, please put the article in English as well.
okay sir will try to keep but most of the people read in telugu sir.