Srinivasa Gargeya Ponnaluri
దైవజ్ఞ పొన్నలూరు శ్రీనివాస గార్గేయ ఆరువేల నియోగి బ్రాహ్మణ కుటుంబం నుంచి జననం. శ్రీ విద్య ఉపాసకులు. పదవ తరగతి నుంచే జ్యోతిష్య శాస్త్ర అధ్యయనం. 45 సంవత్సరముల జ్యోతిష్య శాస్త్ర అనుభవం. బెంగళూరు వెంకట్రామన్ గారి మరియు నిజుమళ్ల సూర్య నారాయణ గారి శిష్యులు . పంచాంగ రచన 35 సంవత్సరాల నుంచి ప్రారంభం. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠానికి దశాబ్దకాలం ఆస్థాన పంచాంగ కర్తగా నియామకం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉండే ఉన్నత స్థాయి వ్యక్తులకు జ్యోతిష్య సలహాలు. భార్య, ఇరువురు కుమార్తెలు. రెండవ కుమార్తె నందిని గార్గేయ చిన్న వయసు నుంచే జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యసిస్తోంది. బీకామ్ కోర్స్ కూడా పూర్తి చేసి, తండ్రి దగ్గర తర్ఫీదు పొంది ప్రస్తుతం భారత దేశ తొలి మహిళా పంచాంగ కర్తగా వ్యవహరిస్తోంది. శ్రీనివాస గార్గేయ భారత ప్రభుత్వం ఆమోదించిన దృగ్గణిత పంచాగ కర్తగా స్థిరపడటం జరిగింది. త్రికాల జ్ఞాన విభూషణ, పంచాంగ కేసరి అనే బిరుదులు కలవు. శతాధిక దేవాలయ ప్రతిష్టలు చేసారు. త్రిస్వర్ణ ఘంటా కంకణ గ్రహీతలు. గత ఇరవై సంవత్సరాల నుంచి టీవీ డిబేట్స్లో పాల్గొంటూ పండుగ నిర్ణయాలపై సముచిత నిర్ణయాలను ఇవ్వటం జరిగింది. భక్తి టీవీలో ప్రారంభం నుంచి దాదాపు దశాబ్దం పాటు తెలుగు ప్రేక్షకులకు గ్రహబలం కార్యక్రమం ద్వారా వినూత్న రీతిలో అనేక ప్రత్యక్ష ప్రసారాలలో పాల్గొన్నారు.