పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 9348632385
జన్మ లగ్నం నుంచి నవమ స్తానమును తండ్రి స్థానం అంటారు . అనగా పితృస్థానం .ఇదే స్థానాన్ని భాగ్య స్తానం లేదా అదృష్టస్థానం అంటారు . తండ్రి స్తానం లో దోషం ఏర్పడితే ,దానినే నవమ స్థాన దోషం లేక అదృష్ఠస్థాన దోషం లేక పితృ దోషం అంటారు .
పితృదోషం అనగానే మరణించిన పెద్దల ఆత్మలు శాంతించని కారణంగానూ ,తండ్రి పాపాలు చేసిన కారణంగానూ వస్తుంటాయి .ఇవి కేవలం నూటికి 5% మాత్రమే ఉంటుంటాయి . మిగిలిన 95% జాతకునికి వ్యతిరేక గ్రహస్తితుల కారణంగా కెరీర్ ,విద్య ,ఉన్నతవిద్య ,ఉద్యోగ ,వ్యాపార ,ఆర్ధిక ,కుటుంబ ,సోదర ,వివాహ ,దాంపత్య ,సంతాన ,ఋణ ,శత్రు ,న్యాయస్థాన ,లాభ, మానసిక ,శారీరిక ,అంశాలలో సమస్యలంటూ వస్తుంటాయి .ఈ సమస్యలు జరుగుతున్నదశలలోను , అష్టమ ,అర్దాష్టమ ఏలినాటిశని సమయాలలోను ,ముఖ్యంగా శని రాహు కేతు దశలలోను అధికంగా ఉంటుంటాయి . అంతే తప్ప ఈ సమస్యలు అనేవి చనిపోయిన వారినుంచి శాపాల రూపంలో వచ్చినవిగా ఉండవు .
కేవలం నవమ స్తానంలో దోషం కనపడగానే …… జాతకునికి మరణించిన వారి వలన పితృ దోషం ఏర్పడిందని వేలాది మంది భావిస్తుంటారు .ఇది వాస్తవం కానే కాదు .కేవలం అదృష్టస్థాన ఉనికి దెబ్బ తిన్న కారణంగా సమస్యలు వస్తుంటాయని భావించరు . ఒక వ్యక్తికి జాతకంలో పితృ దోషం ఏర్పడగానే …. తక్షణమే నారాయణ నాగబలి అనే శాంతి కార్యక్రమం చేయించండని సలహా ఇస్తారు . నారాయణ నాగబలి బ్రతికి ఉన్నవారికి చేసే క్రతువు కాదు .ఇది మరణించిన వారికీ మాత్రమే ఆచరించే పూజా కతువు .
మనం శరీరానికి దుస్తులు మార్చినట్టే …. మనం చనిపోయిన తరువాత మనలో ఉండే ఆత్మ…మరో శరీరంలోకి వెళ్ళిపోతుందని భగవద్గీత లో గీతా చార్యులు తెలియజేసారు .అయితే వ్యక్తి మరణించిన తదుపరి సరైన రీతిలో కర్మకాండలు జరగకపోతే ….ఆత్మ ప్రేతగా మారును. ఈ ప్రేత మన పరిసరాల చుట్టే తిరుగుతుండును కొన్నిసార్లు విష ,శస్త్ర చర్యలచే దుర్మరణం చెందినను ,ప్రమాదవశాత్తు మరణించునను ,ఆత్మ హత్యల వంటివి చేసుకున్నను …..ఆత్మ ప్రేత గానే [కర్మకాండ జరిగినప్పటికీ ] ఉండిపోవును .ఈ ప్రేతలచే సమస్యలనేవి జాతకులకి వస్తుంటాయి .
ఇటువంటి వారికి సరైన రీతిలో మోక్షం కలగడానికే నారాయణ నాగబాలి శాంతిని ఆచరిస్తారు .కోవిడ్ రోజులలో లక్షల మంది మరణించారు ,వీరిలో అత్యధికులు ప్రేతలగానే ఉండిఉంటారు .మరణించిన లక్షలాది మంది ఆత్మలు వేరు వేరు శరీరాల్లోకి ప్రవేశించి ఉండటం కష్టసాధ్యం .
మంచి ఆరోగ్యం కోసం శ్రీ సూర్య భగనుడుని ఆరాధిస్తాము .ఐశ్వర్యం కోసం ఈశ్వరుడిని ప్రార్థిస్తాము .సమస్యల విముక్తికై అగ్ని ద్వారా యజ్ఞాన్ని నిర్వహిస్తాం .అలాగే మరణించినవారికి మోక్షం కలగడానికై విష్ణువుని ప్రార్థిస్తాము.అందుకే మరణించినవారి ఆత్మలకు శాంతి కలగడానికి ,ప్రేతలకు మోక్ష మొందించుటకు చేసే శాంతి పరిహారక్రియనే మోక్ష నారాయణ బలి లేక నారాయణ బలి అంటారు . కనుక పితృదోషం జాతకంలో ఉందని పండితులు ఎవరైనా చెప్పగానే నారాయణ నాగబలి చేయించుకోవద్దు ఇది మరణించిన వారికే తప్ప బ్రతికి ఉన్నవారికి కానే కాదు.
సరే.. నిజంగానే మీరు నూటికి 5% ఉండే పితృదోషాల్లో ఉండి ఉంటే ….మీకు ఏ ప్రేత ద్వార దోషం వ్యాపించిందని నిర్దారించుకుంటారు? సరైన ప్రేత నిర్దారణ లేకుండా ….నారాయణ నాగబాలి చేయించుకోవడం అవివేకం .కనుక అసలు నిజమైన ,శాస్త్రీయమైన రీతిలో అవగాహన తో ఆలోచన చేయటం ముఖ్యం .
ఇది ఇలా ఉంటే ….కొందరు పండితులు జాతకాల్లో పితృదోషం ఉందని గమనించి ,అందుకే వివాహం కావడంలేదని ,వయసు పెరిగిపోతుందని ,వివాహ ప్రయత్నాలు చిట్టచివరివరకు అనుకూలించి చివరిలో విఫలం అవుతున్నాయని …..ఇలాంటి వాటికీ ఆశ్లేషబలి శాంతి హోమాన్ని జరిపించండని సలహాలు ఇస్తారు .అసలు ఆశ్లేష నక్షత్రంలోనే జన్మించినవారికి అయితే ,తక్షణమే ఆశ్లేషబలి చేయమని ఒత్తిడి చేస్తారు . .
ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత సర్పరాజు.ఈ సర్పరాజునే రాహువుగా పిలుస్తాము.
ఈ రాహువుకి ప్రధాన శత్రువే కుజగ్రహం జాతకంలో జాతకం లో కుజుడు రాహువు కలిసినా,రాహువు పై కుజగ్రహ చూపు పడిన నాగదోషం ఏర్పడుతుంది.నాగదోషం అనగానే సర్ప శాపమని భావిస్తారు. వాస్తవానికి ఇది సరైన భావం కాదు. ఒక ముఖ్య కార్యం విజయం చేకూరక,తరచుగా నాగాలు [పెండింగ్ ] పడటాన్ని నాగదోషము అంటారు. ఈ నాగదోషము ,పితృదోషం వంటివి జాతకంలో ఉంటే ఆశ్లేషబలి చేయమని వారి సలహా.
అసలు ఆశ్లేషాబలి అంటే అర్ధం ఏమిటి? ఒక వ్యక్తి జాతకంలో కుజ గ్రహము కర్కాటక రాశి లో సంచారంలో ఉందనుకుందాం.కర్కాటక రాశి కుజనికి నీచ స్తానం .ఈ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో కుజ గ్రహ సంచారం ఉన్నపుడే ఆశ్లేష బలి గురించి ఆలోచనచేయాలి .ఆ వ్యక్తి జాతకంలో లగ్నం నుంచి రెండవ స్థానంగా చెప్పబడే కుటుంబ స్థానాధిపతిగా,పంచమస్థానంగా చెప్పబడే సంతానాధిపతిగా,సప్తమంగా చెప్పబడే వివాహ స్థానాధిపతిగా కుజగ్రహం ఉంటూ ....ఆ కుజుడే జాతకంలో ఆశ్లేషలో సంచారం ఉంటేనే ఆశ్లేష బలి శాంతికార్యం ఆచరించాలి . అనగా మీన ,వృషభ,కర్కాటక ,తుల ,ధనస్సు , లగ్నాలలో జన్మించినవారికి మాత్రమే కుజుడు కుటుంబ సంతాన వివాహ స్థానాధిపతిగా ఉంటాడు.
ఇటువంటి వారికి కుజుడు ఆశ్లేష లో ఉంటె ......ఆశ్లేష బలి అవసరము .లేదా ఎవరికైనా పితృదోషం ఉండి వారు ఏ నక్షత్రంలో జన్మించునను ,వారి వారి జాతకాలలో కుజగ్రహ స్థితులను బట్టి ఆశ్లేష బలి అవసరము . మొత్తం మీద పితృదోషాలలో ఉండే వందలకొద్దీ కాంబినేషనల బట్టి ,పితృదోష నివారణ ఒకరోజుతో ముగిసె క్రతువు కాదు.ఇది 11 నెలలు కొనసాగే క్రతువు .కనుక ఈ క్రతువును 11మాసాలు ఎలా నిర్వహిస్తారనే అంశాలతో ..... .4వ భాగంలో తెలుసుకుందాం ......
పొన్నలూరి శ్రీనివాస గార్గేయ [9348632385]