Home Blogs శని వక్ర గమనంలో పఠించాల్సిన హ్రీం బీజ నామావళి

శని వక్ర గమనంలో పఠించాల్సిన హ్రీం బీజ నామావళి

by gargeyaastro

పొన్నలూరి శ్రీనివాస గార్గేయ, 9348632385

శ్రీ లలితా సహస్రం మరియు శ్రీ లలితా త్రిశతి రెండూనూ బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం అధ్యాయం లోనివి. ఈ అధ్యాయం అంతా హయగ్రీవ స్వామి మరియు ఆగస్త్య మహర్షి మధ్య సంభాషణ రూపంలో ఉంటుంది.

మొదట శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని ఆగస్త్యుడికి హయగ్రీవ స్వామి బోధించారు. కానీ ఆగస్త్యుడు తృప్తి చెందలేదు. ఇంకా అదనంగా బోధించుటకు హయగ్రీవ స్వామి సంకోచించారు. ఎందుకంటే అవి అత్యంత రహస్యమైనవి కనుక. అప్పుడు శ్రీ లలితా దేవి స్వయంగా హయగ్రీవునికి ప్రత్యక్షమై, ఆగస్త్యునికి బోధించమని చెప్పగా, అప్పుడు హయగ్రీవ స్వామి తన శిష్యుడైన ఆగస్త్యునికి శ్రీ లలితా త్రిశతి స్తోత్రాన్ని బోధిస్తాడు.

శ్రీ లలితా త్రిశతిస్తోత్రం దేవత యొక్క 300 మంత్రాలను (నామాలను) వివరిస్తుంది. మంత్ర స్వరూపమైన అమ్మరూపంలో మూడు భోగములు అనగా, మూడు కూటములున్నవి. అవి,

వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము. కూటము అనగా ఒక సమూహము అని అర్థం.
శ్రీ లలితా పరమేశ్వరి మంత్రమును శ్రీ విద్యా మంత్రమని చెప్ప బడింది. ఇది 15 అక్షరాల మహా మంత్రం. దీనినే పంచ దశ మహా మంత్ర మంటారు. ఈ 15 బీజాక్షరాల మహా మంత్రం 3 కూటములు గా ఉన్నది.

మొదటి భాగము ముఖము, అనగా శిరస్సు నుండి కంఠము వరకు; రెండవది కంఠము నుండి కటి వరకు; మూడవది కటి నుండి పాదాంగుష్టము వరకు ఉన్న భాగము.

మొదటి భాగం లో క, ఏ, ఈ, ల, హ్రీం అనే (5) బీజాక్షరాల తో ఉన్న కూటము. దీనినే వాగ్బవ కూటమంటారు.
రెండవ భాగములో హ, స, క, హ, ల, హ్రీం అనే (6) బీజాక్షరాల తో ఉన్న కూటము. దీనినే కామరాజ కూటమంటారు. మూడవ భాగంలో స, క, ల, హ్రీం అనే (4) బీజాక్షరాల తో ఉన్న కూటము. దీనినే శక్తి కూటమంటారు.

పంచ దశ మహ మంత్రానికి బీజాక్షరాలు 15. ఒక్కో బీజాక్షరానికి 20 మంత్రాల చొప్పున 15X20=300 మంత్రాలగును. ఇవే 300 నామాలు.
ఒక్కో కూటములో హ్రీం చివరి బీజాక్షరంగా ఉంటుంది. అనగా మూడు కూటములలో 3 హ్రీం బీజాక్షరాలు వస్తాయి.
ఒక్కో బీజానికి (20) మంత్రాలు ( నామాలు) చొప్పున మొత్తం (60) నామాలు.

వాస్తవానికి శ్రీ లలితా త్రిశతి, దేవీ ఖడ్గమాల మంత్రాలు ఉపదేశం ఉంటేనే పఠించాలి. ప్రస్తుతము చెప్ప బోయే హ్రీం బీజాక్షరం అర్థ నారీశ్వర తత్వమన్నమాట. అనగా కామేశ్వర, కామేశ్వరీ తత్వము. కనుక ఈ హ్రీం బీజాక్షరంలో ఉన్న నామాలు ఎవరైనా పఠించవచ్చును.

శనిగ్రహం ఖగోళంలో ప్రతి సంవత్సరం వక్ర గమనంలో ఉంటాడు. ఈ వక్ర గమన సంచారంలో అందరూ ఈ (60) నామాలను ఉదయం నుండి మధ్యాహ్నం లోగా పఠించాలి. అవకాశం లేకపోతే, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పాద ప్రక్షాళన చేసిన పిమ్మట భక్తితో పఠించాలి.

వాగ్భవ కూటము

ఓం హ్రీంకారరూపాయై నమః
ఓం హ్రీంకారనిలయాయై నమః
ఓం హ్రీంపదప్రియాయై నమః
ఓం హ్రీంకారబీజాయై నమః
ఓం హ్రీంకారమంత్రాయై నమః
ఓం హ్రీంకారలక్షణాయై నమః
ఓం హ్రీంకారజపసుప్రీతాయై నమః
ఓం హ్రీంమత్యై నమః
ఓం హ్రీంవిభూషణాయై నమః
ఓం హ్రీంశీలాయై నమః

ఓం హ్రీంపదారాధ్యాయై నమః
ఓం హ్రీంగర్భాయై నమః
ఓం హ్రీంపదాభిధాయై నమః
ఓం హ్రీంకారవాచ్యాయై నమః
ఓం హ్రీంకారపూజ్యాయై నమః
ఓం హ్రీంకారపీఠికాయై నమః
ఓం హ్రీంకారవేద్యాయై నమః
ఓం హ్రీంకారచింత్యాయై నమః
ఓం హ్రీం నమః
ఓం హ్రీంశరీరిణ్యై నమః

కామరాజ కూటము

ఓం హ్రీంకారిణ్యై నమః
ఓం హ్రీంకారాద్యాయై నమః
ఓం హ్రీంమధ్యాయై నమః
ఓం హ్రీంశిఖామణ్యై నమః
ఓం హ్రీంకారకుండాగ్నిశిఖాయై నమః
ఓం హ్రీంకారశశిచంద్రికాయై నమః
ఓం హ్రీంకారభాస్కరరుచ్యై నమః
ఓం హ్రీంకారాంభోదచంచలాయై నమః
ఓం హ్రీంకారకందాంకురికాయై నమః
ఓం హ్రీంకారైకపరాయణాయై నమః

ఓం హ్రీంకారదీర్ధికాహంస్యై నమః
ఓం హ్రీంకారోద్యానకేకిన్యై నమః
ఓం హ్రీంకారారణ్యహరిణ్యై నమః
ఓం హ్రీంకారావాలవల్లర్యై నమః
ఓం హ్రీంకారపంజరశుక్యై నమః
ఓం హ్రీంకారాంగణదీపికాయై నమః
ఓం హ్రీంకారకందరాసింహ్యై నమః
ఓం హ్రీంకారాంభోజభృంగికాయై నమః
ఓం హ్రీంకారసుమనోమాధ్వ్యై నమః
ఓం హ్రీంకారతరుమంజర్యై నమః

శక్తి కూటము

ఓం హ్రీంకారమూర్త్యై నమః
ఓం హ్రీంకారసౌధశృంగకపోతికాయై నమః
ఓం హ్రీంకారదుగ్ధబ్ధిసుధాయై నమః
ఓం హ్రీంకారకమలేందిరాయై నమః
ఓం హ్రీంకరమణిదీపార్చిషే నమః
ఓం హ్రీంకారతరుశారికాయై నమః
ఓం హ్రీంకారపేటకమణ్యై నమః
ఓం హ్రీంకారాదర్శబింబికాయై నమః
ఓం హ్రీంకారకోశాసిలతాయై నమః
ఓం హ్రీంకారాస్థాననర్తక్యై నమః

ఓం హ్రీంకారశుక్తికా ముక్తామణ్యై నమః
ఓం హ్రీంకారబోధితాయై నమః
ఓం హ్రీంకారమయసౌర్ణస్తంభవిదృమ పుత్రికాయై నమః
ఓం హ్రీంకారవేదోపనిషదే నమః
ఓం హ్రీంకారాధ్వరదక్షిణాయై నమః
ఓం హ్రీంకారనందనారామనవకల్పక వల్లర్యై నమః
ఓం హ్రీంకారహిమవద్గంగాయై నమః
ఓం హ్రీంకారార్ణవకౌస్తుభాయై నమః
ఓం హ్రీంకారమంత్రసర్వస్వాయై నమః
ఓం హ్రీంకారపరసౌఖ్యదాయై నమః

You may also like

2 comments

Avatar
కోట్ల శుభ July 8, 2024 - 8:25 pm

గురువు గారికి శత కోటి నమస్కారములు
మీరు చాలా చాలా బాగా చెప్పినారు.
మీరు చెప్పినది ప్రతీది నేను చేస్తాను.
ఈ రోజు నా అదృష్టం కొద్దీ మీరు చెప్పిన
త్రిశతి 60 నామాలు చదవడం మొదలు పెట్టినాను.
చాలా చాలా ధన్యవాదములు గురువు గారు.🙏

Reply
Avatar
gargeyaastro October 29, 2024 - 11:13 am

subham

Reply

Leave a Reply to gargeyaastro Cancel Reply