Gargeya Astro
  • Home
  • About
  • Our Services
  • Nitya Panchangam
  • Blog
  • Gallery
  • Store
    • Kalayogam Prime
    • Kalayogam Mini
    • 2022 Calendars
  • Youtube
  • Contact Us
Saturday, May 2, 2026 @ 3:46 pm
  • Facebook
  • Twitter
  • Instagram
  • Email
Call For Appointments - 918341032385
Gargeya Astro
  • Home
  • About
  • Our Services
  • Nitya Panchangam
  • Blog
  • Gallery
  • Store
    • Kalayogam Prime
    • Kalayogam Mini
    • 2022 Calendars
  • Youtube
  • Contact Us
Saturday, May 2, 2026 @ 3:46 pm
Gargeya Astro
Call For Appointments
Gargeya Astro
  • Home
  • About
  • Our Services
  • Nitya Panchangam
  • Blog
  • Gallery
  • Store
    • Kalayogam Prime
    • Kalayogam Mini
    • 2022 Calendars
  • Youtube
  • Contact Us
Copyright 2024 - All Right Reserved
Blogs

varahi navaratrulu

by gargeyaastro July 5, 2024
written by gargeyaastro

July 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Blogs

ముందుమాట

by gargeyaastro April 20, 2024
written by gargeyaastro

అసంఖ్యాకమైన మేధావులకు భరతభూమి పుట్టినిల్లు. మన హైందవ ప్రాచీన మేధావుల గురించి చెప్పుకోవడం మొదలు పెడితే, అది తరిగే విషయం కాదు. మహా ఋషులే ప్రాచీనకాలం లోని శాస్త్రవేత్తలు. జగమెరిగిన పురాణ ప్రసిద్ధులు అనేకమంది వున్నారు. ప్రాచీన మహర్షులు ఏకాగ్రతతో తపస్సులు చేస్తూ, మనోనిశ్చలత, వాక్సుద్ధి, దివ్యదృష్టి వంటి అద్భుత శక్తులను సంపాదించేవారు. తాము సాధించిన శక్తితో సృష్టి, ప్రకృతిల గురించి తెలియజేస్తూ, ఎంతో శాస్త్రీయ పరిజ్ఞానం వున్న వేదాలను వ్రాసుకొచ్చారు. యజ్ఞ యాగాలనే ప్రయోగాలతో ప్రకృతి శక్తులను కైవసం చేసుకోవడం తెలుసుకున్నారు. దుష్టులను సంహరించటానికి అస్త్రాలను కూడా రూపొందించారు. లోక కళ్యాణానికి ఎన్నో – ఎన్నెన్నో మార్గాలను చూపించారు.విశ్వం స్వరూప స్వభావాలను గురించి, ప్రకృతి శక్తుల గురించి వేద ఋషులు స్పష్టాతి స్పష్టమైన సిద్ధాంతాలను మనకు అందించారు. గ్రహగతులకు మానవుని భవిష్యత్తుకు అవినాభావ సంభంధం ఉన్నదని మూడువంతుల ఖగోళ విజ్ఞానమును ఋగ్వేదంలో వుంచారు.

దీన్ని బట్టి వేద ఋషుల యొక్క ఖగోళశాస్త్ర పరిజ్ఞానం ఎంత అపారమైనదో తెలుస్తుంది. నక్షత్ర సమూహాలైన గెలాక్సీ గురించి, రాశిచక్రాన్ని గురించి, విషువత్తుల గురించి, ధ్రువతార మార్పులను గురించి, సౌరశక్తిని గురించి, గ్రహాల గురించి, భూమి వర్ణన…దాని చలానాలను గురించి, ఉత్తరద్రువం, ఋతువుల గూర్చి… ఇలా… ఎన్నో… ఎన్నెన్నో అంతరిక్ష ఖగోళ విజ్ఞానాంశాలు నిండిన గ్రంధమే ఋగ్వేదం. పైన తెల్పిన విశేషాలపై ఆధారపడే జ్యోతిష్యశాస్త్రం పుట్టింది. జ్యోతిషం కోసం గ్రహగతులను లెక్కించాలి. కనుక జ్యోతిషంతో పాటు గణితం కూడా చెట్టాపట్టాలు వేసుకొని పెరిగింది. అటు జ్యోతిషంలోను ఇటు గణితం లోను ఆరితేరిన మేదావులైన పరాశరుడు, ఆర్యభట్ట, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు లాంటివారు అతి ప్రాచీన కాలంలోనే తమ శాస్త్రీయ పరిజ్ఞానంతో మన హిందూ జాతిని ముందుకు నడిపించిన మేధావులు. ఇట్టివారిని మనం మననం చేసుకుంటూ, నిత్యం నమస్కరించుకోవాలి.

ఇందుచే వేద పురుషుని చక్షువుగా జ్యోతిశ్శాస్త్రం గుర్తింపబడినది. ఆకాశంలో కనపడే సూర్యచంద్రులు, నక్షత్రములు, గ్రహములు మొదలైన వాటిని మానవుడు పరికిస్తూ, కాలగమనంలో క్రమం తప్పకుండా వస్తున్న మార్పులను జ్యోతిష శాస్త్రం ద్వారా గమనించటం జరుగుతుంది.గనుక ప్రకృతిలోని సమస్తవస్తు జాలముల సృష్టి స్థితి లయములకు కాలమే హేతువవుతోంది. ఈ కాలమును అతిక్రమించుట ఎవ్వరికీ సాధ్యము కాదు. దేవతలు, రాక్షసులు, రాజులు, ప్రజలు, జంతువులు, సర్వప్రాణులు కాలవశముననే జనించుట, నశించుట జరుగుతుంది. ప్రాచీన మహర్షులు కాలమునకు రూపం కల్పించి కాలపురుషునిగా గ్రహించారు. ఇందులో కొన్ని సమయములు కొన్ని సంఘటనలకు కారణములుగా చెప్పబడతాయి. ఈ సంఘటనలు గ్రహప్రభావములచే అకస్మాత్తుగా కొత్త మార్గం లో ప్రయాణిస్తాయి. నిర్ణయాత్మకమైన మార్పులచే మానవుని సాంఘిక జీవితలో వివిధ రకాలుగా ప్రయోజనాన్ని కల్గించే శాస్త్రాలలో అత్యంత ప్రాధాన్యత కల్గిన శాస్త్రముగా జ్యోతిష్యశాస్త్రం నిలబడిపోయింది.

మానవుని అవసరాలకు, కోరికలకు జ్యోతిష్యపరమైన విచారణకు, పరిశీలనకు ఎల్లప్పుడూ ప్రేరేపణ శక్తులుగా వుంటున్నాయి. ఈ కారణములే మానవుని జీవితంలో విభిన్న సందర్భాలలో ఏర్పడే ఘటనలకు జ్యోతిష ఫల శాస్త్రమునకు గల అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. ఈ శాస్త్రముననుసరించే జీవితంలోని సంఘటలను వీలైనంత ఖచ్చితంగానే చెప్పవచ్చును. 19 వ శతాబ్ది ఉత్తరభాగము నాటికి మానవుని జనన కాలమును ఖచ్చితంగా నమోదు చేయుటకు ప్రామాణిక గడియారాలు లేకపోవడం, అత్యల్ప సంఖ్యలోనే విధ్యావంతులున్డటం, సక్రమమైన గణితాలతో పంచాంగాలు అందుబాటులో లేకపోవడమనే ముఖ్య లోపాలు వుండేవి. 20 వ శతాబ్ది మధ్యభాగం నాటికి ఇవన్నీ పూర్తిగా సమకూరడంతో జ్యోతిషరంగం ప్రపంచ ప్రజల సమస్యలకు ధీటుగా జవాబు చెప్పగల స్థాయిలో ఉందనుటలో సందేహంలేదు.

మహాపుణ్య ప్రదంగా, ప్రత్యక్ష నిదర్శనంచే రహస్యమైనదిగా సూర్యచంద్రుల సాక్షులు కల్గినదిగా, వేదములచే ప్రభోదించ బడినదిగా, శ్రౌత స్మార్తాదిగా అన్ని కార్యములకు ఉపయుక్తమైనదిగా, కాలాన్ని సూచించునది, మానవునికి జన్మకర్మల ప్రకారము ప్రాప్తించే శుభాశుభ ఫల నిర్ణయం చేయునదైన ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారా భవిష్య ఫలితాలను, అనేక పురాణ ఇతిహాస సారాంశాలను, ధర్మ సందేహాలకు సమాధానాలను, రాబోయే గ్రహ సంచార స్థితి గతులను సకాలంలో సకుటుంబ సపరివార సమేతంగా సందర్శించటానికై సనాతన సంప్రదాయ సమాచార సంగ్రహాన్ని సగర్వంగా మీకు అందించనుంది మా ” gargeya astro.com“. క్రమం తప్పక సందర్శకులు ఆసక్తితో చదవగలరని ఆశిస్తూ – దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

April 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Blogs

పితృ దోషాలు – గత జన్మ దోషాలకు పరిహారాలు పార్ట్ -7

by gargeyaastro September 2, 2023
written by gargeyaastro

శ్రీనివాస గార్గేయ 8341132385

ప్రతీ వ్యక్తి జన్మ జాతకంలో అనేక దోషాలు ఉంటుంటాయి..
ముఖ్యంగా లగ్నం నుంచి 1, 4, 9,10 స్థానాల ద్వారా గత జన్మలో చేసిన పుణ్య కార్యాల పుణ్య ఫలితాలను ఈ జన్మలో అనుభవించగలరు. అలాగే లగ్నం నుంచి 3, 6, 8, 12 స్థానాలను బట్టి గత జన్మలో చేసిన పాప కార్యాల పాపపు ఫలితాలను ఈ జన్మ లో అనుభవిస్తారు. ఈ విధంగా గత జన్మనుంచి వెంట తెచ్చుకునే పుణ్య పాప కర్మలను సంచిత కర్మలు అంటారు.
 

జాతకాలలో 1,4,9,10 స్థానాల ద్వారా పుణ్య కర్మ ఫలితాలు ఈ జన్మ లో అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ, అటువంటి వారలకు తమ తమ జాతకాలలో ఇతర వ్యతిరేక గ్రహాస్థితులు వున్నపుడు… ఈ జన్మ లో తాము అనుభవించాల్సిన పుణ్య ఫలితాలను ఈ జన్మలో అనుభవించలేరు..

అలాగే 3, 6 8,12 స్థానాల ద్వారా ఏమైనా పాపకార్యాల, పాపపు ఫలితాలు ఈ జన్మ లో రావాల్సిండగ….. అదృష్టవశాత్తు ఏవైనా శుభ గ్రహస్థితిగతులు  ఉన్నపుడు…. ఈ జన్మలో వ్యతిరేకతలు, సమస్యలకు బదులుగా….. చక్కని అనుకూల ఫలితాలను పొందగలరు. కనుక వ్యక్తుల జాతకాలలో పుణ్య కార్య ఫలితాలు ఉండి కూడా….ఈ జన్మ లో సమస్యలు ఎదుర్కుంటారు … అలాగే పాపఫలితాలకు బదులుగా శుభఫలితాలు ఈ జన్మలో పొందుతుంటారు…. దీనికి కారణమేమనగా వారి వారి జాతకాలలో గ్రహసంచార స్థితిగతులని భావించాలి..

పై ప్రకారంగా గత జన్మ నుంచి వచ్చిన సంచిత కర్మలను ఈ జన్మలో అనుభవిస్తుంటారు… ఇక వీరి జాతకాలలో పితృదోషాలు, ప్రారబ్దదోషాలు, నాగదోషాలు, కారకోభావనాశాయ ( వివాహలు దెబ్బతినటము), అశ్రేషబలి, మొదలైన అనేక దోషాలతో మగ్గుతుంటారు… కనుక వారి వారి జాతక స్థితిగతులను బట్టి…. గత జన్మ పాప పుణ్యలను బట్టి, ఈ జన్మలో ఉన్న జాతక స్థితులను బట్టి…. సమస్యలను ఎదుర్కునే వారు వుంటారు, అనుకూలతను పొందేవారు వుంటారు…ఇలాంటి పరిస్థితులలో కొందరికి ఉద్యోగ, వ్యాపార, ఆర్ధిక, కుటుంబ, మానసిక, శారీరక, వివాహ, సంతాన, లాభ అంశాలలో పూర్తిగా వ్యతిరేకతలను పొందేవారు వుంటారు… జీవితకాలం సమస్యలతో బాధపడుతూ…. ఈ జన్మను ముగించి…. పై జన్మకు ఈ కర్మలను మోసుకుని వెళ్తారు… ఇలాంటి కర్మలనే ఆగామి కర్మలు అంటారు..

కనుక ప్రతీవ్యక్తి జాతకంలో ఉండే ప్రతికూల అంశాలను బట్టి తగిన రీతిలో పరిహార శాంతుల కొరకుగా 11నెలల పాటు జరిగే 97రోజుల ప్రత్యేక శాంతి క్రతువుల ద్వారా కొంత ఉపశాంతి మార్గాన్ని పొందవచ్చు.

ముఖ్యంగా ప్రతి సంవత్సరం వచ్చే భాద్రపదమాసం మహాలయ పక్షాలలో…. వారి వారి కుటుంబంలో మరణించిన వారికి పితృ కార్యములు, తర్పణ కార్యములు ఆచరిస్తుంటారు. ఈ విధంగా పితృకార్యాలు, తర్పణ కార్యాలు ఆచరించటం ఎంతో విశిష్టదాయకం. ఇలా ఆచరించే వారి జాతకాలలో …. ఎవరికైనా పితృదోషాలు వున్నచో…. వారు చేసిన పితృ కార్యాల వలన తమకున్న పితృదోషాలు వెళ్ళిపోతాయని అనుకోరాదు. మరణించిన వారికి చేపట్టే కార్యాలకు…..పితృదోషాల నివారణ కొరకుగా చేసే కార్యాలకు చాలా చాలా వ్యత్యాసం వున్నదని గమనించాలి..

పితృదోషాలున్నవారు, లేనివారు కూడా 97రోజులపాటు జరిగే కార్యాలను జీవితంలో ఒకసారి ఆచరిస్తే సరిపోతుంది…. ప్రతిసoవత్సరం మరణించినవారి కొరకుగా చేసే పితృకార్యాలు (తద్దినాలు )ప్రతి సంవత్సరం చేస్తూనే ఉండాలి. కనుక ఈ వ్యత్యాసాన్ని గమనించాలి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీనివాస గార్గేయగారి అభిమానుల అభ్యర్ధన మేరకు, దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ గారి ఆధ్వర్యంలో ఈ 97రోజుల శాంతి పరిహార క్రతువులకు శ్రీకారం జరిగింది. ప్రతీ తెలుగు మాసంలో పూర్ణిమ నుంచి అమావాస్య మధ్యగల 15రోజులలో 9 రోజులు మాత్రమే కార్యక్రమాలు జరుగును.9వ రోజు అమావాస్యగా ఉండును. ఒకవేళ ఆ అమావాస్య సోమవారం వస్తే ఆ నెలలో 9 రోజులకు బదులుగా 8 రోజులే కార్యక్రమం జరుగును. అందుకే ఈ 2023 కార్తికమాసం నుంచి రాబోయే 2024 భాద్రపధమాసం వరకు మొత్తం 11నెలలో 99రోజులు పరిహార క్రతువులు జరగవలసి వున్నది… కానీ 2024 లో ఫాల్గుణ మాసం మరియు శ్రావణ మాసంలలో అమావాస్య తిధి సోమవారం వచ్చినందున ఆ రెండు నెలలో 8రోజులే జరుగును.అనగా ఒక్కో నెలకు 9 రోజుల చెప్పున 11 నెలలకు 99 రోజులు జరగవలసి ఉండగా…..ఫాల్గుణ  శ్రావణలలలో సోమవారం అమావాస్య వచ్చినందున 97రోజులుగా కార్యక్రమాలు జరుగును.

2023 డిసెంబర్ 4నుంచి శాంతి పరిహార కార్యక్రమములు ప్రారంభమై 2024 అక్టోబర్ 2 మహాలయ అమావాస్య తో ముగిసిపోవును.

ఎవరెవరి జాతకాలలో పితృదోషాలు,( ఈ పితృ దోషాల్లో వందలకొద్ది కాంబినేషన్లు ఉన్నవి )నాగ దోషాలు, ప్రారబ్దదోషం, ఆశ్రేషబలి , గురుచండాలయోగం, వివాహ సంబంధిత దోషాలు, శుక్రగ్రహ, గురుగ్రహ బలహీన దోషాలు, అభివృద్ధిని కాలరాసే దోషాలతో పాటు అనేకానేక దోషాలన్ని ఉన్న వారందరికీ అనుకూలంగా ఉండే రుసుముతో ఈ 97రోజుల బృహత్తర కార్యక్రమం జరగబోతున్నది. మీరు కూడా చేరి మీకున్న దోషాలు ఉపశమించుకునాలంటే…


శ్రీనివాస గార్గేయ
8341132385

September 2, 2023 2 comments
0 FacebookTwitterPinterestEmail
Blogs

పితృ దోషాలు – పరిహారాలు పార్ట్ 6

by gargeyaastro August 17, 2023
written by gargeyaastro

కర్మ జ్యోతిష్య సిద్ధాంతం ప్రకారం…. పితృదోషం ఉన్నవారు తప్పనిసరిగా నివారణ చర్యల కోసం ఆలోచన చేయాలి. చిన్న వయసు నుంచే కెరీర్ లో ఇబ్బందులు,కష్టాలు, విద్యలో ఎదుగుదల లేకపోవటం, ఎంత చదివినను పరీక్షలలో ఉత్తిర్ణత శాతం పెరగకపోవటం…. ఒకవేళ విద్య లోనూ ఉన్నత విద్యలోనూ బాగా ప్రవీణ్యం ఉన్నప్పటికి…. తాము చదివిన విద్య, దేనికి పనికిరాకుండా పోవటం జరుగును. ఒక్కోసారి తమ తమ చదువులకు తగ్గట్లు గా ఉద్యోగాలు లేకుండా…. కేవలం బ్రతుకుతెరువు కోసమే జీవనం సాగించే వారు ఎందరెందరో ఉంటారు. ఇలాగే తమ జీవిత కాలాన్ని వెళ్ళదీసుకుంటారు.
ఇక కొంతమంది ఉద్యోగం వద్దని, వ్యాపారమే ముద్దుగా భావించి…. తమకు తోచిన వ్యాపారాలపై మక్కువ చూపుతు… లక్షలాది రూపాయలను పెట్టుబడిగ ఉంచి…. చివరకు చిల్లిగవ్వ కూడ సంపాదించలేక, రుణ బాధలతో, మానసిక బాధలతో నష్టపోతూ, చివరికి తట్టుకోలేక జీవితాన్నే బలితీసుకుంటారు.. ఇందులో కొంతమంది మహా తెలివితేటలు ప్రదర్శిస్తూ, తమ తమ వ్యాపారాలను భారీగా వ్యాప్తిజేసీ….చివరకు నమ్మక ద్రోహాలవలన,అతి తెలివి ప్రదర్శించిన కారణంగానూ…దివాలా తీసి ఆస్తులను పోగొట్టుదురు.ఇందుకు ప్రధాన ఉదాహరణగా అనిల్ అంబానీ గారిని చెప్పుకోవచ్చును.

ఇక సంతాన అంశాలలోకి వస్తే….. వివాహమై సంవత్సరాలు గడిచినను సంతానం లేకుండా ఉంటుంటారు.. పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. వాటివలన కూడా ఫలితం దొరక్క వైద్యులు చుట్టూ తిరుగుతుంటారు.. ఇన్ని చేసినను సంతానం సాఫల్యం కాకుండ ఉండును. గర్భం ధరించిననూ గర్భ స్రావాలు జరగడం… ఒక్కోసారి గర్భం నిలిచిననూ, చిట్ట చివరిలో ఏదొక సమస్య రావటము…. ప్రసవం అయినప్పటికీ, కలిగిన సంతానం ప్రయోజకులు కాకుండా ఉండిపోవటం జరుగును. కొన్నిసార్లు చక్కని సంతానం కలిగి విద్యాధికులు అయినను… సరైన రీతిలో తమ జీవితాన్ని కొనసాగింపక సంఘవిద్రోహ శక్తులతో కలవటము, తల్లితండ్రులకు చెడ్డ పేరు తెచ్చేవారుగా ఉంటారు..మరికొందరైతే అల్పాయుష్ తోనే జీవితం వెళ్ళదీసుకుంటారు… ఈ విధంగా చెప్పుకుంటూ పొతే సంతాన సమస్యలు అనేకముంటూ…చెప్పలేని స్థితుల
తో మగ్గిపోతుంటారు…

అలాగే వివాహ నిర్ణయాలకొస్తే, ఎన్ని ప్రయత్నాలు చేసిననూ వివాహం కాకుండా ఉండిపోవటము… ఆలస్య వివాహాలు, దాంపత్య సమస్యలు, న్యాయస్థానాలచే విడాకులు వచ్చిననూ, విడాకులు ఇచ్చిన వ్యక్తితో తిరిగి సమస్యలు ప్రారంభం కావటము, దంపతుల మధ్య కొట్లాటలు హత్యల వరకు దారితీయుటం, ఒక్కోసారి వరుసగా 2 లేక 3 వివాహాలు జరిగినను, అవి విఫలం కావటం… ఇలా ఇలా ఎన్నెన్నో తీవ్రాతి తీవ్ర సమస్యలు ఉత్పన్నం కావటం జరుగు సూచనలు అధికం. కేవలం పితృదోషాలతోనే కాకుండా నాగదోషం, కారకో భావనశాయ,కుజదోషం వంటి తీవ్ర దోషాల ఫలితాలు కూడా ఈ కోవలోకే వస్తాయని గమనించాలి

ఇక ఆయుర్భావ విషయంలో గండములు, ప్రమాదములు, అల్పాయుష్షు, వంటివి ఉండమూ, ఇవే కాకుండ ఆపనిందలు, అపజయములు, అవమానములు, న్యాయ వ్యవహారములలో గెలుపు, ఓటములు, ఎన్నికలలో గెలుపు ఓటములు, జననేంద్రియ సమస్యలు, దౌర్జన్యాలు, అవకాశాలు చేజారిపోవటము, అన్యాయం గా ఆస్తులు ఆక్రమించటము, రాజదండనాలు, వ్యసనములకు లోనవటము, దారిధ్ర్యమూ , కారగారము, శత్రువులు,రోగములు, ఋణములు,వ్రణములు,విపత్తులు పెరగటము,ధనం రొటేషన్ చేయలేకపోవటము, జీవితమంతా అసత్య వాక్కులు, కుటుంబ వ్యక్తులతోను, దాయాదులతోనూ, ఇరుగుపొరుగు వారితోనూ కలహాలు, నష్టాలు మొదలగువన్నీ ఒకదాని వెంట ఒకటి రావటం జరుగుతుండును.

అన్నింటి కంటే ముఖ్యంగా జాతక చక్రాలలో 10వ స్థానాన్ని లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు.11వ స్థానాన్ని లాభ స్థానమని అంటారు.9వ స్థానాన్ని అదృష్టస్థాన మంటారు. 10, 11 స్థానాలలో సంపాదించిన లబ్ది కావచ్చు, కీర్తి కావచ్చు, ఎదుగుదల కావచ్చు, విశేష స్థితిగతులు కావచ్చు…. ఇవన్నీ చిరస్థాయిగా ఉండి, ఆ జాతకులు సుఖ సంతోషాలతో జీవనం గడపాలంటే, తప్పనిసరిగా వారి జాతకంలో నవమ స్థానామనే అదృష్ట స్థానం మరింత బలంగా ఉండాలి. కానీ ఈ అదృష్టస్థానమనేది కొన్ని సార్లు పితృదోషాల వలన బలహీనపడుతుంటుంది. అందుచే జాతకులకు కెరీర్, డెవలప్మెంట్, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వ్యాపార, వాహన, గృహ, వివాహ, సంతాన, ఆర్ధిక, కుటుంబ, రుణ, శత్రు, రాజ్యస్థాన, లాభ స్థాన అంశాలలో అనుకోకుండానే వ్యతిరేకతలు వస్తుంటాయి.

ఎవరెవరి జాతకాలలో పితృదోషాలనేవి ఉంటుంటాయో అలాంటివారందరికి, ప్రతి సంవత్సరము 6 నెలలపాటు గోచార స్థితిగతుల ప్రకారం వ్యతిరేకతలనేవి వారి జీవన సరళిలో వస్తుంటాయి. జాతకం లో ఉండే పితృదోషాల ప్రకారం వచ్చే వ్యతిరేకతలకు తోడుగా….. ప్రస్తుతం ఖగోళంలో జరిగే గోచార గ్రహస్థి తులచే….6నెలలు వ్యతిరేఖ తలు కచ్చితంగా ఉంటూనే ఉంటాయి.పితృదోషమనే నిర్వచనం ప్రకారం….. పితృకారకుడైన రవితో శని లేదా రాహువు లేదా కేతువు కలిసినను… లేదా రవి వైపు శని 3వ చూపుతో ఏడవ చూపుతో 10వ చూపుతో చూసినపుడు కూడా పితృదోషం ఆపాదించును. ఈ పితృదోషాలలో వందలకొద్ది కాంబినేషన్లు ఉన్నాయని గత శీర్షికలలో చెప్పడం జరిగింది.

ఈ పరంపరలో ఈ 2023 ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17వరకు నెలరోజులపాటు సింహ రాశిలో ఉన్న రవివైపు శనిగ్రహ 7వ చూపు పడింది. తిరిగి 2023 అక్టోబర్18 నుంచి నవంబర్ 16వరకు తులా రాశిలో రవితో కేతువు కలవడం జరగనుంది.తిరిగి 2023 నవంబర్ 16నుంచి డిసెంబర్ 16వరకు నెల రోజులపాటు వృశ్చిక రాశిలో వుండే రవి వైపు శనిగ్రహ దశమ చూపుపడింది. తిరిగి 2024 ఫిబ్రవరి 13 నుంచి మార్చ్ 14 వరకు నెల రోజుల పాటు కుంభరాశిలో శనిగ్రహంతోనే రవి కలిసి సంచారం జరగనుంది. తిరిగి 2024 మార్చ్ 14 నుంచి ఏప్రిల్ 13 వరకు నెల రోజులపాటు మీన రాశిలో రాహువుతో రవి కలవటం జరగనుంది. ఆపైన తిరిగి 2024 ఏప్రిల్14 నుంచి మే14 వరకు నెల రోజులపాటు మేష రాశిలో సంచారం చేయబోయే రవిపైన శనిగ్రహ మూడవ చూపు పడనుంది. అనగా పైన పేర్కొన్న తేదీలలో రవి పైన శని చూపులు,రవితో శని కలయిక,రవితో కేతు కలయిక,రవితో రాహు కలయిక జరగనున్నవి.అనగా ఆరునెలల పాటు రవికి పితృదోషం ఆవహించిందని భావము. పరోక్షంగా చెప్పాలంటే ఈ ఆరు నెలలు అదృష్టస్థాన ఉనికి తగ్గునని భావము.

కాబట్టి ఎవరెవరి జాతకాలలో పితృదోషాలనేవి ఉంటుంటాయో, వారందరు పైన చెప్పిన తేదీలలో తగు తగు జాగ్రత్తలు తీసుకుంటూ, వారి వారి అదృష్టస్థాన ఉనికిని కాపాడుకునేవిధంగా ప్రయత్నం చేయాలి. ప్రతిసంవత్సరం…పై విధంగా 6మాసాలు దోష ప్రభావాలు ఉంటుంటాయి. ఎప్పుడైనా శని రాహువులు లేదా శని కేతువులు కలిసిన సంవత్సరాలలో….5 నెలలు మాత్రమే వ్యతిరేకతలు ఉంటుంటాయి. కనుక ఇలాంటి వ్యతిరేకతలనుంచి ఉపశాంతి పొందుటకై 2023 సెప్టెంబర్ 3వ తేదీనుంచి 97రోజుల పాటు ప్రత్యేక శాంతి హోమ కార్యములు జరుగును. ఇవి ప్రతి నెలలో 9రోజులు జరిగేలా 11నెలలు జరుగును.ఈ హోమ తేదీలనేవి పూర్తిగా తెలుసుకొనటకు “పితృదోషాలకు పరిహార శాంతులు పార్ట్ 6″లో వివరంగా ఇవ్వబడినవి. రాబోయే 8వ భాగంలో ఈ పరిహార శాంతి కార్యాల విధివిధానాలు, రుసుము చెల్లింపు విధానము, మొదలగు అంశాలన్నీ ఉంటాయని గమనించాలి.
శ్రీనివాస గార్గేయ
9348632385

August 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Blogs

పితృదోషాలకు 99రోజుల పరిహార శాంతులు పార్ట్ -5

by gargeyaastro July 14, 2023
written by gargeyaastro

శ్రీనివాస గార్గేయ 9348632385
జాతకాలలో లగ్నం నుంచి నవమ స్తానంగా చెప్పబడే పితృస్థానము లేక తండ్రిస్తానము లేక భాగ్యస్థానము లేక అదృష్టస్థానములో దోషాలున్నపుడు, వాటిని పితృదోషాలంటారు .నూటికి 3నుంచి 5శాతం వరకు మాత్రమే మరణించిన పెద్దల ఆత్మలకు శాంతి కలగని కారణంగా పితృదోషాలు వస్తుంటాయి.మిగిలిన 95 నుంచి 97శాతం వరకు మరణించిన పెద్దల వలన దోషాలు రాకుండ కేవలం జాతకుల వ్యక్తిగత జాతకాలలో ఇతర వ్యతిరేక గ్రహస్తితుల వలన కూడా పితృదోషాలు వస్తుంటాయి .ఇవి వందలకొద్ధి కాంబినేషన్ లు ఉన్నవని గ్రహించాలి .
ఇక పితృదోషాల ప్రభావం అష్టమ ,అర్దాష్టమ ,ఏలినాటిశని పీరియడ్స్ లోనూ …… శని రాహు కేతు మహా దశలల్లోను అంతర్దశల్లోనూ వ్యతిరేక ఫలితాలు ఇచ్చును .ఇందుకొరకుగా ఉపశాంతి పొందుటకై ప్రత్యేక పద్దతిలో ప్రతి నెలలో 9 రోజుల పాటు శాంతి కార్యాలు చేయాలి .ఈ విధంగా 11 నెలల పాటు ఆచరించాలి. అంటే మొత్తం 99రోజులు ఆచరించాలన్నమాట.
ప్రతినెలలో పూర్ణిమ ,అమావాస్య మధ్యలోనే 9రోజుల కార్యక్రమం జరుగును .ఒక సోమవారం తో ప్రారంభమై ……..మంగళ బుధ ,గురు, శుక్ర ,శని ,ఆదివారాలలో …. 7 రోజులు జరుగును .ప్రతి రోజు ఉన్న వారానికి అధిపతి ఏ గ్రహమగునో ,ఆ గ్రహానికి తగిన రీతిలో శాంతి పరిహార హోమం జరుగును. అనగా 7 రోజులలో చంద్ర,కుజ,బుధ,గురు,శుక్ర,శని రవి గ్రహాలకు పరిహార హోమం జరుగును. ఇక మిగిలినది రాహు కేతువులు మాత్రమే ..
తరువాత సోమవారం నాడు ఉదయం 7 గంటల 30 నిముషాల నుంచి 9 గంటల వరకు వుండే రాహుకాలం లో రాహు సంబంధ హోమ శాంతి జరుగును. అలాగే అదేరోజు ఉదయం 10గంటల 30 నిమిషాల నుంచి 12 గంటలవరకు వుండే యమగండ కాలం లో కేతు గ్రహానికి హోమ శాంతి జరుగును. ఇంతటితో నవగ్రహాలకు కార్యక్రమాలు ముగియును. ఇక మిగిలిన 9వ రోజు కార్యక్రమం అమావాస్యరోజున జరుగును . అయితే సోమవారము ,మరియు అమావాస్య ఒకేరోజు వచ్చే సందర్భాలు కూడా అప్పుడపుడు ఉంటాయి .ఇలాంటి సందర్భాలలో సోమవారం నాటి రాహు కేతువుల హోమ శాంతులు మరియు అమావాస్య నాటి హోమ శాంతి ఒకేరోజున జరుగును. ఇలా వచ్చిన సందర్భాలలో కేవలం 8 రోజులలోనే ,ఆమాస క్రతువులు ముగియును .
పితృ దోషాలకు 99రోజుల పాటు చేయవలసిన పరిహార హోమశాంతి కార్యాలను ….. పితృదోషం, ప్రారబ్దదోషం నాగదోషం,ఆశ్రేష బలి మొదలయినవి ,ఏ వ్యక్తికి ఉండునో …..వారి జన్మ నక్షత్ర,జాతక గ్రహస్థితులను, 3 ప్రత్యేకమైన ఆకులలో లిఖించి ,36 కలశాలతో ,ప్రతినెలలో 9 రోజులు జరిగే విధంగా 11నెలలగాను 99రోజులు హోమశాంతి కార్యములు నిష్ణాతులైన పండితులతో సామూహికంగా ప్రత్యేకపీఠం లో నిర్వహించబడును .
ఈ 11మాసాలలో ,ఎప్పుడైనా అమావాస్య సోమవారం కలిసి వస్తే ఒకరోజు తగ్గును .ఈ పరంపరలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర నిజ శ్రావణమాసం నుంచి రాబోయే శ్రీ క్రోధి నామ సంవత్సర జేష్ఠ మాసం వరకు గల 11నెలలలో రెండుసార్లు సోమవారం అమావాస్య వచ్చినవి .అందువలన 99రోజులకు బదులుగా 97రోజులు మాత్రమే హోమశాంతి కార్యక్రమములు జరుగును . పై విధంగా 97రోజులు 11మాసాలలో ఏ ఏ తేదీలలో జరుగునో …6వ భాగం లో వివరించబడును .ప్రజా శ్రేయస్సుకొరకుగా అతి తక్కువ ఖర్చుతోనే 97రోజుల కార్యక్రమం జరుగును ..97రోజుల హోమశాంతి కొరకుగా ఒకరికి అయ్యే మూల్యం 11000రూపాయలు మాత్రమే.
ఈ 99రోజుల కార్యక్రమములు ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్ లో లైవ్ స్ట్రీమింగ్ గా ప్రసారం జరుగును. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోరిక మేరకు ఈ కార్యక్రమాలు అన్నియూ దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ గారి సారధ్యంలో జరుగును ..

July 14, 2023 2 comments
0 FacebookTwitterPinterestEmail
Blogs

పితృ దోషాలు- పరిహారములు పార్ట్ -4

by gargeyaastro July 14, 2023
written by gargeyaastro

పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 9348632385
జాతకాలలో జన్మ లగ్నం నుంచి నవమ స్థానాన్ని తండ్రి స్తానం లేదా పితృ స్తానం లేదా అదృష్ట స్తానం లేదా భాగ్య స్తానం అంటారు. ఈ స్తానం లో దోషము ఏర్పడితే ,దానిని నవమ స్థాన దోషం లేక పితృదోషం లేదా అదృష్టదోషం అంటారు.
పితృదోషం అనగానే భయపడేవారు సంఖ్య ఎక్కువ. ఎందుకంటే మరణించినవారి నుంచి దోషాలు ఆపాదించి వుంటాయేమో ననే భయంతో ఉంటుంటారు .నూటికి కేవలం 5%మాత్రమే మరణించిన వారి నుంచి దోషాలు ఆపాదింపబడును .మిగిలిన 95% జాతకాలలో వ్యతిరేక గ్రహస్తితుల కారణంగానే అదృష్టస్థానంలో దోషాలు వస్తుంటాయి .
ఒక వ్యక్తి జీవించి ఉన్నవుడు తన దుస్తులను ఏ విధంగా మార్చుకుంటాడో ,అదే విధంగా ఓ వ్యక్తి మరణించగానే ,తన ఆత్మ శరీరంనుంచి వెళ్ళిపోయి మరొక శరీరంలోకి ప్రవేశించి ఇంకో జననం జరుగునని భగవద్గీత లో గీతా చార్యులు చెప్పారు. మరణించిన వ్యక్తికి మోక్షం కలగాలని తమ వారు కర్మకాండలు ఆచరిస్తారు ఒక్కోసారి కర్మకాండలు జరగకుండా కూడా ఉంటుంటాయి ఉదాహరణకు కోవిద్ సమయంలో లక్షలాదిమంది చనిపోయారు . అత్యధిక భాగం కర్మకాండ చేయకుండానే ఉండిపోయారు .అలాగే కొన్ని కొన్ని దుర్మరణాలు జరుగుతున్న సందర్భాలలో కూడా కర్మకాండలు జరగనందున ,శరీరంలో ఉండే ఆత్మ ప్రేతగా మారును .ఇలాంటి ప్రేతలు తమ వారి కోసంగా తిరుగుతుంటాయి ఈ సందర్భాలలో ఆ ప్రేతల వలన వచ్చే దోషాలను పితృదోషాలని పిలుస్తారు.
ఎవరికైతే కర్మకాండలు మరణించిన సమయంలో జరగకుండా వుంటాయో ,అలంటి వారి కొరకుగా నారాయణ నాగబలి అనబడే శాంతి కార్యాన్ని ఆచరిస్తారు. ఆరోగ్యం కావాలంటే సూర్యారాధన చేయాలి. ఐశ్వర్యం కావాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి.అదే విధంగా ఓ వ్యక్తికి మోక్షం కలగాలంటే విష్ణువుని ప్రార్ధించాలి .అందుకే మరణించిన వ్యక్తియొక్క ప్రేతకు మోక్షం కలగటానికి నారాయణ నాగబలిని నిర్వహిస్తారు.
అయితే ప్రస్తుత రోజులలో ఎవరికైనా పితృదోషం ఉందనగానే తక్షణమే ఆ వ్యక్తి ని నారాయణ నాగబలి కార్యాన్ని చేయించుకోమని సలహాలిచ్చే పండితులు ప్రస్తుత రోజులలో ఉన్నారు .వాస్తవానికి బ్రతికి ఉన్నవారెవరికి నారాయణ నాగబలి ని జరిపించరు .కేవలం మరణించిన వారికీ మాత్రమే నారాయణ నాగబలి కార్యాన్ని ఆచరిస్తారు .ఏ వ్యక్తి వలన పితృదోషం ఏర్పడిందో తెలుసుకోవటం కష్టసాద్యం .అ లాంటి పరిస్థితులలో ……దోషం పట్టి బ్రతికి ఉన్న వ్యక్తే తన పేరుతో నారాయణ నాగబలి కార్యాన్ని చేయించుకోకూడదు ..ఆలా చేయించుకుంటే ఇంకా సమస్యలు పెరుగునే తప్ప తరగవు .

ఇది ఇలా ఉండగా మరికొందరు పండితులు పితృదోషం వున్నదనగానే ,వెంటనే ఆశ్రేష శాంతి కార్యాన్ని ఆచరించమని సలహాలిస్తారు అసలు ఆశ్రేషబలి అంటే అర్ధమే తెలియని వారందరు ……ఆశ్రేషబలి ని జరిపించడని సలహాలివ్వడం విడ్డురం.అసలు జాతకంలో ఆశ్రేషబలి అనగా ఏమిటో తెలుసుకుందాం .
కర్కాటకరాశి కుజ గ్రహానికి నీచస్థానంగా ఉంటుంది .ఎవరి జాతకంలోనైనా కుజగ్రహం కర్కాటకరాశి లో ఆశ్రేష నక్షత్రం లో ఉండాలి. దీనితోపాటు ఆ జాతకం లో కుజ గ్రహానికి కుటుంబ స్థాన ఆధిపత్యంగాని ,సంతాన స్థాన ఆధిపత్యం గాని ,వివాహస్థాన అధిపత్యంగాని వచ్చి ఉంటేనే ఆశ్రేషాబలి కార్యాన్ని ఆచరించాలి. ఈ కోణంలో లెక్కిస్తే మీన, వృషభ ,కర్కాటక ,తుల .ధనుర్లగ్నాలలో జన్మించిన వారికీ మాత్రమే ….కర్కాటకరాశిలో కుజుడు ఆశ్రేష నక్షత్రం లో సంచారం ఉంటేనే ఆశ్రేషబలి కార్యాన్ని ఆచరించాలి .

అంతే తప్ప కేవలం వివాహం కాని ఆశ్రేష జాతకులకు లేదా వివాహ సమస్యలను ఎదుర్కొనె ఆశ్రేష జాతకులకు….ఆశ్రేషాబలి కార్యాన్ని జరిపించడం తగదు .

కనుక పితృదోషాలు ,నాగదోషాలు, ఇతర వ్యతిరేక గ్రస్థితుల కారణంగా సమస్యలనేవి వస్తుంటాయి .అసలు పై దోషాల కారణంగా కెరీర్ డెవలప్ కాకపోవటం,సరైన సమయంలో ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడటము , అసలు ఉద్యోగం లేకుండా ఉండటం ,వ్యాపారం నష్టాల్లో ఉండటము . వివాహ ప్రయత్నాలు విఫలం కావటం ,వివాహం అయితే దాంపత్యసమస్యలు పెరగటం , కోర్ట్ లలో వేసినను విడాకులు మంజూరు కాకపోవటం ,సంతాన సమస్యలు,ఆర్ధిక సమస్యలు ,రక్తసంబంధీకులతో సమస్యలు ,ఋణ భాదలు పెరగటం ,శత్రువులు రెచ్చిపోవటము ,చేసే కార్యలలో అపజయాలు భాగస్వామ్య సమస్యలు ,గృహం కొరకు స్థలం కొనుగోలు చేస్తే కబ్జా కావటం,కుటుంబం లో మనస్పర్థలు, సంతానం వృద్ధి లేకపోవటం ,ఒకే గృహం లో పలువురికి వయసు పెరిగినను వివాహాకాకపోవటం.వీటితో పాటు మానసిక,శారీరిక సంఘర్షణలు ఇంకా ఇంకా ….చెప్ప నలవికాని సమస్యలు ఎన్నో పై దోషాలవలన వస్తుంటాయి .
ఇన్ని రకాల సమస్యలు ఉన్నపుడు ,ఎవరికీ తోచిన పరిహారాలు వారు చేసుకుంటుంటారు .కానీ ఇన్ని సమస్యలు ఉన్నపుడు ఒకరోజులోనే ఆచరించే నారాయణ నాగబలి ,ఆశ్రేషాబలి కార్యాలకు వేలాది రూపాయలను వెచ్చించి పరిహారాలు కూడా చేసుకునేవారు ఎందరెందరో ఉన్నారు.కానీ పితృదోష నివారణ ఒకరోజుతో ముగిసే క్రతువు కాదు .ఈ క్రతువును ఒక నెల కు 9 రోజులు చెప్పున 11నెలలకు 99 రోజులు ఆచరించాలి .ఇలా చేస్తేనే పితృదోషాలలో ఉన్న వందలకొద్దీ కంబినేషన్లచే వచ్చే సమస్యలకు ఉపశాంతి ఏర్పడును.
ఒకరోజు ఆచరించే నారాయణ నాగబలి వంటి కార్యాలకు సుమారు 15000 రుపాయలు ఖర్చు ఉంటే ,99 రోజులు చేసే శాంతి కార్యాలకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అగునోననే అనుమానం చాల మందికి వస్తుంది.నిజానికి చెప్పాలంటే 99రోజుల సాగె ప్రత్యేక హోమాలకు ప్రత్యేక పద్దతిలో కేవలం 11000 రూపాయల తోనే ప్రత్యేక పీఠం లో జరుపబడును .మరి ఈ 99రోజుల హోమ శాంతి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి ?ఏ ఏ రోజులలో చేయాలి?మొదలైన అంశాలపై 5వ భాగం లో తెలుసుకుందాం
పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 9348632385

July 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts
  • About
  • Contact Us
  • Our Services
  • Blog
  • Nitya Panchangam
  • Photo Gallery
  • YouTube
  • Store

Copyright © 2024 Gargeya Astro | All Rights Reserved.

Gargeya Astro
  • Home
  • About
  • Our Services
  • Nitya Panchangam
  • Blog
  • Gallery
  • Store
    • Kalayogam Prime
    • Kalayogam Mini
    • 2022 Calendars
  • Youtube
  • Contact Us