Gargeya Astro
  • Home
  • About
  • Our Services
  • Nitya Panchangam
  • Blog
  • Gallery
  • Store
    • Kalayogam Prime
    • Kalayogam Mini
    • 2022 Calendars
  • Youtube
  • Contact Us
Saturday, May 2, 2026 @ 5:14 pm
  • Facebook
  • Twitter
  • Instagram
  • Email
Call For Appointments - 918341032385
Gargeya Astro
  • Home
  • About
  • Our Services
  • Nitya Panchangam
  • Blog
  • Gallery
  • Store
    • Kalayogam Prime
    • Kalayogam Mini
    • 2022 Calendars
  • Youtube
  • Contact Us
Saturday, May 2, 2026 @ 5:14 pm
Gargeya Astro
Call For Appointments
Gargeya Astro
  • Home
  • About
  • Our Services
  • Nitya Panchangam
  • Blog
  • Gallery
  • Store
    • Kalayogam Prime
    • Kalayogam Mini
    • 2022 Calendars
  • Youtube
  • Contact Us
Copyright 2024 - All Right Reserved
Blogs

పితృ దోషం అనగానే భయం వద్దు – పార్ట్ 3

by gargeyaastro July 9, 2023
written by gargeyaastro

పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 9348632385

జన్మ లగ్నం నుంచి నవమ స్తానమును తండ్రి స్థానం అంటారు . అనగా పితృస్థానం .ఇదే స్థానాన్ని భాగ్య స్తానం లేదా అదృష్టస్థానం అంటారు . తండ్రి స్తానం లో దోషం ఏర్పడితే ,దానినే నవమ స్థాన దోషం లేక అదృష్ఠస్థాన దోషం లేక పితృ దోషం అంటారు .

పితృదోషం అనగానే మరణించిన పెద్దల ఆత్మలు శాంతించని కారణంగానూ ,తండ్రి పాపాలు చేసిన కారణంగానూ వస్తుంటాయి .ఇవి కేవలం నూటికి 5% మాత్రమే ఉంటుంటాయి . మిగిలిన 95% జాతకునికి వ్యతిరేక గ్రహస్తితుల కారణంగా కెరీర్ ,విద్య ,ఉన్నతవిద్య ,ఉద్యోగ ,వ్యాపార ,ఆర్ధిక ,కుటుంబ ,సోదర ,వివాహ ,దాంపత్య ,సంతాన ,ఋణ ,శత్రు ,న్యాయస్థాన ,లాభ, మానసిక ,శారీరిక ,అంశాలలో సమస్యలంటూ వస్తుంటాయి .ఈ సమస్యలు జరుగుతున్నదశలలోను , అష్టమ ,అర్దాష్టమ ఏలినాటిశని సమయాలలోను ,ముఖ్యంగా శని రాహు కేతు దశలలోను అధికంగా ఉంటుంటాయి . అంతే తప్ప ఈ సమస్యలు అనేవి చనిపోయిన వారినుంచి శాపాల రూపంలో వచ్చినవిగా ఉండవు .

కేవలం నవమ స్తానంలో దోషం కనపడగానే …… జాతకునికి మరణించిన వారి వలన పితృ దోషం ఏర్పడిందని వేలాది మంది భావిస్తుంటారు .ఇది వాస్తవం కానే కాదు .కేవలం అదృష్టస్థాన ఉనికి దెబ్బ తిన్న కారణంగా సమస్యలు వస్తుంటాయని భావించరు . ఒక వ్యక్తికి జాతకంలో పితృ దోషం ఏర్పడగానే …. తక్షణమే నారాయణ నాగబలి అనే శాంతి కార్యక్రమం చేయించండని సలహా ఇస్తారు . నారాయణ నాగబలి బ్రతికి ఉన్నవారికి చేసే క్రతువు కాదు .ఇది మరణించిన వారికీ మాత్రమే ఆచరించే పూజా కతువు .

మనం శరీరానికి దుస్తులు మార్చినట్టే …. మనం చనిపోయిన తరువాత మనలో ఉండే ఆత్మ…మరో శరీరంలోకి వెళ్ళిపోతుందని భగవద్గీత లో గీతా చార్యులు తెలియజేసారు .అయితే వ్యక్తి మరణించిన తదుపరి సరైన రీతిలో కర్మకాండలు జరగకపోతే ….ఆత్మ ప్రేతగా మారును. ఈ ప్రేత మన పరిసరాల చుట్టే తిరుగుతుండును కొన్నిసార్లు విష ,శస్త్ర చర్యలచే దుర్మరణం చెందినను ,ప్రమాదవశాత్తు మరణించునను ,ఆత్మ హత్యల వంటివి చేసుకున్నను …..ఆత్మ ప్రేత గానే [కర్మకాండ జరిగినప్పటికీ ] ఉండిపోవును .ఈ ప్రేతలచే సమస్యలనేవి జాతకులకి వస్తుంటాయి .

ఇటువంటి వారికి సరైన రీతిలో మోక్షం కలగడానికే నారాయణ నాగబాలి శాంతిని ఆచరిస్తారు .కోవిడ్ రోజులలో లక్షల మంది మరణించారు ,వీరిలో అత్యధికులు ప్రేతలగానే ఉండిఉంటారు .మరణించిన లక్షలాది మంది ఆత్మలు వేరు వేరు శరీరాల్లోకి ప్రవేశించి ఉండటం కష్టసాధ్యం .

మంచి ఆరోగ్యం కోసం శ్రీ సూర్య భగనుడుని ఆరాధిస్తాము .ఐశ్వర్యం కోసం ఈశ్వరుడిని ప్రార్థిస్తాము .సమస్యల విముక్తికై అగ్ని ద్వారా యజ్ఞాన్ని నిర్వహిస్తాం .అలాగే మరణించినవారికి మోక్షం కలగడానికై విష్ణువుని ప్రార్థిస్తాము.అందుకే మరణించినవారి ఆత్మలకు శాంతి కలగడానికి ,ప్రేతలకు మోక్ష మొందించుటకు చేసే శాంతి పరిహారక్రియనే మోక్ష నారాయణ బలి లేక నారాయణ బలి అంటారు . కనుక పితృదోషం జాతకంలో ఉందని పండితులు ఎవరైనా చెప్పగానే నారాయణ నాగబలి చేయించుకోవద్దు ఇది మరణించిన వారికే తప్ప బ్రతికి ఉన్నవారికి కానే కాదు.
సరే.. నిజంగానే మీరు నూటికి 5% ఉండే పితృదోషాల్లో ఉండి ఉంటే ….మీకు ఏ ప్రేత ద్వార దోషం వ్యాపించిందని నిర్దారించుకుంటారు? సరైన ప్రేత నిర్దారణ లేకుండా ….నారాయణ నాగబాలి చేయించుకోవడం అవివేకం .కనుక అసలు నిజమైన ,శాస్త్రీయమైన రీతిలో అవగాహన తో ఆలోచన చేయటం ముఖ్యం .

ఇది ఇలా ఉంటే ….కొందరు పండితులు జాతకాల్లో పితృదోషం ఉందని గమనించి ,అందుకే వివాహం కావడంలేదని ,వయసు పెరిగిపోతుందని ,వివాహ ప్రయత్నాలు చిట్టచివరివరకు అనుకూలించి చివరిలో విఫలం అవుతున్నాయని …..ఇలాంటి వాటికీ ఆశ్లేషబలి శాంతి హోమాన్ని జరిపించండని సలహాలు ఇస్తారు .అసలు ఆశ్లేష నక్షత్రంలోనే జన్మించినవారికి అయితే ,తక్షణమే ఆశ్లేషబలి చేయమని ఒత్తిడి చేస్తారు . . ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత సర్పరాజు.ఈ సర్పరాజునే రాహువుగా పిలుస్తాము.

ఈ రాహువుకి ప్రధాన శత్రువే కుజగ్రహం జాతకంలో జాతకం లో కుజుడు రాహువు కలిసినా,రాహువు పై కుజగ్రహ చూపు పడిన నాగదోషం ఏర్పడుతుంది.నాగదోషం అనగానే సర్ప శాపమని భావిస్తారు. వాస్తవానికి ఇది సరైన భావం కాదు. ఒక ముఖ్య కార్యం విజయం చేకూరక,తరచుగా నాగాలు [పెండింగ్ ] పడటాన్ని నాగదోషము అంటారు. ఈ నాగదోషము ,పితృదోషం వంటివి జాతకంలో ఉంటే ఆశ్లేషబలి చేయమని వారి సలహా.

అసలు ఆశ్లేషాబలి అంటే అర్ధం ఏమిటి? ఒక వ్యక్తి జాతకంలో కుజ గ్రహము కర్కాటక రాశి లో సంచారంలో ఉందనుకుందాం.కర్కాటక రాశి కుజనికి నీచ స్తానం .ఈ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో కుజ గ్రహ సంచారం ఉన్నపుడే ఆశ్లేష బలి గురించి ఆలోచనచేయాలి .ఆ వ్యక్తి జాతకంలో లగ్నం నుంచి రెండవ స్థానంగా చెప్పబడే కుటుంబ స్థానాధిపతిగా,పంచమస్థానంగా చెప్పబడే సంతానాధిపతిగా,సప్తమంగా చెప్పబడే వివాహ స్థానాధిపతిగా కుజగ్రహం ఉంటూ ....ఆ కుజుడే జాతకంలో ఆశ్లేషలో సంచారం ఉంటేనే ఆశ్లేష బలి శాంతికార్యం ఆచరించాలి . అనగా మీన ,వృషభ,కర్కాటక ,తుల ,ధనస్సు , లగ్నాలలో జన్మించినవారికి మాత్రమే కుజుడు కుటుంబ సంతాన వివాహ స్థానాధిపతిగా ఉంటాడు.

ఇటువంటి వారికి కుజుడు ఆశ్లేష లో ఉంటె ......ఆశ్లేష బలి అవసరము .లేదా ఎవరికైనా పితృదోషం ఉండి వారు ఏ నక్షత్రంలో జన్మించునను ,వారి వారి జాతకాలలో కుజగ్రహ స్థితులను బట్టి ఆశ్లేష బలి అవసరము . మొత్తం మీద పితృదోషాలలో ఉండే వందలకొద్దీ కాంబినేషనల బట్టి ,పితృదోష నివారణ ఒకరోజుతో ముగిసె క్రతువు కాదు.ఇది 11 నెలలు కొనసాగే క్రతువు .కనుక ఈ క్రతువును 11మాసాలు ఎలా నిర్వహిస్తారనే అంశాలతో ..... .4వ భాగంలో తెలుసుకుందాం ......

పొన్నలూరి శ్రీనివాస గార్గేయ [9348632385]

July 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Blogs

పితృదోషం అంటే అసలు ఏమిటి ? రెండవ భాగం

by gargeyaastro June 30, 2023
written by gargeyaastro

పొన్నలూరి శ్రీనివాస గార్గేయ
9348632385

జన్మ లగ్నం నుంచి నవమ స్థానాన్ని పితృ స్తానం అని అంటారు .అనగా తండ్రి స్థానము. పితృ కారక గ్రహం రవి . ఈ రవి కి శని రాహువు కేతువు శత్రువులు . శని రాహు కేతువులలో ఏ ఒక్క గ్రహం అయినను….. నవమ స్థానము లో ఉన్నచో పితృదోషం వచ్చును పితృ స్థానాన్ని భాగ్య స్తానము లేదా అదృష్ట స్థానమని కూడా పిలుస్తారు .

పితృ కారక గ్రహం రవి ,ఈ రవి కి శని రాహువు కేతువు శత్రువులు .జాతక చక్రం లో రవి ఏ స్తానం లో ఉన్నను ,రవి తో పాటు ఏ ఒక్క శత్రువు కలిసినచో……. రవి బలహీనుడు అయి పితృదోషానికి లోనగును .ఎప్పుడైతే రవి బలహీనుడు అగునో ,వెంటనే అదృష్టస్థాన ఉనికి తగ్గును .అనగా అదృష్టస్థానము కూడా బలహీనపడును
ఈ పితృదోషాలలో అనేక వందల కొద్ధి కాంబినేషనలు ఉన్నవి .ఇందులో ముఖ్యంగా కొన్ని కాంబినేషన్ లు గమనించండి

1 .లగ్నం నుంచి నవమ స్తానంగా చెప్పబడే అదృష్ట స్థాన అధిపతి ఏ గ్రహం అయితే ఉండునో ,ఆ గ్రహం జాతక చక్రం లో ఏ స్తానంలో నైన రాహువు తో కలిస్తే పితృదోషం ఏర్పడును .ఉదాహరణ కు మేష లగ్నానికి ,కర్కాటక లగ్నానికి గమనిద్దాం .ఈ రెండు లగ్నాలకు అదృష్టస్థాన అధిపతి శుభగ్రహ గురువు .ఇట్టి గురువు జాతక చక్రం లో ఏ స్తానంలో రాహువు తో కలిసినా పితృదోషమని భావించాలి .అయితే గురువు రాహువుల కలయికను గురుఛండాలయోగం అంటారు .ఇక్కడ ఒకవైపు గురుఛండాలయోగం తో పటు పితృదోషం కూడా ఏర్పడింది అలాగే మరో ఉదాహరణ తీసుకుంటే…. ధనుర్లగ్నానికి నవమ స్తానంగా ఉండే అదృష్టస్థానమే సింహరాశి .ఈ స్తానంలో ఒకవేళ గురువు రాహువు ఉన్నారనుకుందాం ఇప్పుడు మూడు దోషాలు ఏర్పడినవి మొదటిది గురురాహువుల కలయికచే గురుఛండాలయోగం కాగా ,రెండవది నవమ స్థాన రాహువు వలన పితృదోషం కాగా ,3వ ది సింహ గురు దోష0.ఈ 3 దోషాలకు వ వ్యతిరేకతలు ఉంటాయి

2. అలాగే కన్యాలగ్నO ,కుంభ లగ్నాలకు నవమ స్థానానికి అధిపతి శుక్రుడు .ఈ శుక్రుడు జాతక చక్రంలో ఎక్కడైనా రాహువు తో కలిస్తే పితృ దోషం వచ్చును .శుక్ర రాహువుల కలయికే ఒక దోషం కాగా…… ఈ రెండు లగ్నాలకు పితృ దోషం కూడా అదనంగా ఉంది .

పైన చెప్పిన లగ్నాలకు రవితో సంబంధం ఎక్కడా లేనేలేదు కాని పితృ దోషాలేర్పడినవి .అసలు పితృ దోషం అనగానే తండ్రి పాపాలు చేసినందున ,మరణించిన వారి ఆత్మలు శాంతించనందున పితృ దోషాలు వస్తుంటాయని అందరు భావిస్తారు. పితృ దోషం అనగానే భయపడి ఆందోళన చెందుతారు . నిజానికి చెప్పాలంటే నూటికి 5% మాత్రమే మరణించిన వారి నుంచి దోషాలు వస్తుంటాయి . మిగిలిన 95%మాత్రం కేవలం అదృష్టస్థానం దెబ్బతిన్న కారణంగా వస్తుంటాయని భావించాలి.

అదృష్టస్థానం దెబ్బతిన్న కారణంగానే సమస్యలనేవి చిన్న వయసు నుంచే ప్రారంభం అవుతుంటాయి . జరుగుతున్న దశలతో సంబంధం లేకుండానే సమస్యలు వెన్నంటి ఉంటాయి . అర్దాష్టమ, అష్టమ ,ఏలినాటి శని జరిగే సమయాల్లో ఎవరికయితే అదృష్ట స్థాన దోషాలు ఉంటాయో ,వారికీ మాత్రం సమస్యల ప్రభావం తీవ్రంగా ఉండును .

అదృష్టస్థాన దోషం ఉన్నందున కెరిర్ సజావుగా సాగకపోవటం ,విద్యలో వైఫల్యాలు ,ఉద్యోగ సమస్యలు,వ్యాపారాలు దెబ్బతినటం ,రుణ భారం పెరగటం వివాహ వైఫల్యాలు, ఆలస్య వివాహాలు ,దంపతుల మధ్య కలహాలు ,వయసు 50 దాటినను వివాహం కాకుండా ఉండటం ,సోదరీ సోదరుల మధ్య ఘర్షణలు ,కళత్రవియోగము ,ఆస్థి తగాదాలు ,శతృవృద్ది ,గర్భశోకములు ,అవకాశాలు చేజారిపోవటం ,అపకీర్తి ,కారాగారవాసము ,తల్లి తండ్రులను కోల్పోవటము మరియు దూరం కావటము ,అశాంతి వాతావరణం ,మోసానికి గురికావటం ,కుటుంబం నుండి విడిపోవటము ,నిత్య దారిద్రియము ,సంతానలేమి,సంతానం ప్రయోజకులు కాకపోవటం ,వ్యసనాలు ,నిరుద్యోగము, అకాల మరణములు ,వాహన ప్రమాదములు ,మనో బుద్ధి వైకల్యాలు …….ఈ విధంగా ఎన్నో ఎన్నెనో సమస్యలనేవి వెంటాడుతుంటాయి ఇవన్నీ కూడా లగ్నం నుంచి నవమ స్తానమనే అదృష్ట స్తానం దెబ్బతిన్న కారణంగా వచ్చే సమస్యలని గ్రహించాలి .

కనుక లగ్నం నుంచి నవమ స్థానంలో ఏర్పడే అదృష్ట దోషాలకు చెందిన కాంబినేషన్ లు వందలకొద్దీ వున్నాయి .వీటిలో 5%మాత్రమే మరణించిన వారి నుంచి దోషాలు వస్తుంటాయి.
నవమ స్తానం లో దోషం కనపడగానే ,వాస్తవాలు తెలుసుకుని తగిన రీతిలోనే పరిహారాలు పాటించాలి .నవమ స్తానం ఎంత బలీయంగా ఉంటేనే …జీవితం లో విశేషంగా యోగాలను పొందగలరు .పరిహారాలు పాటించిన రాత్రి కి రాత్రే అనుకూలతలు రావు .పై దోషాలు తొలగుటకు దీర్ఘకాల పరిహారాలు ఆచరించాలి .

ప్రస్తుత రోజులలో పితృ దోషమనగానే నారాయణ నాగబలి అనే శాంతి కార్యక్రమం జరిపించండని కొందరు చెబుతుంటారు .నిజానికి నారాయణ నాగబలి కార్యక్రమాన్ని ఎవరికి చేయించాలి ? ఎవరికి చేయకూడదనే విచక్షణ కూడా తెలుసుకోవాలి. దీనితో పాటు పితృ దోషాలనబడే అదృష్ట దోషాలకు తెలిసి తెలియకుండా ఆశ్లేష బలి కూడా చేస్తుంటారు .అసలు ఆశ్లేష బలి అనగా ఏమిటి ? అదృష్ట దోషాలకు ,ఆశ్లేషబలికి ఉన్న సంబంధం ఏమిటో …..

అనేక ఆసక్తికర అంశాలు అన్నిటిని మూడవభాగంలో తెలుసుకుందాం

పొన్నలూరి శ్రీనివాస గార్గేయ
9348632385 {భారత ప్రభుత్వ ఆమోదిత దృగణిత పంచాంగకర్త హైదరాబాద్ }

June 30, 2023 2 comments
0 FacebookTwitterPinterestEmail
Blogs

శని వక్ర గమనంలో పఠించాల్సిన హ్రీం బీజ నామావళి

by gargeyaastro June 29, 2023
written by gargeyaastro

పొన్నలూరి శ్రీనివాస గార్గేయ, 9348632385

శ్రీ లలితా సహస్రం మరియు శ్రీ లలితా త్రిశతి రెండూనూ బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం అధ్యాయం లోనివి. ఈ అధ్యాయం అంతా హయగ్రీవ స్వామి మరియు ఆగస్త్య మహర్షి మధ్య సంభాషణ రూపంలో ఉంటుంది.

మొదట శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని ఆగస్త్యుడికి హయగ్రీవ స్వామి బోధించారు. కానీ ఆగస్త్యుడు తృప్తి చెందలేదు. ఇంకా అదనంగా బోధించుటకు హయగ్రీవ స్వామి సంకోచించారు. ఎందుకంటే అవి అత్యంత రహస్యమైనవి కనుక. అప్పుడు శ్రీ లలితా దేవి స్వయంగా హయగ్రీవునికి ప్రత్యక్షమై, ఆగస్త్యునికి బోధించమని చెప్పగా, అప్పుడు హయగ్రీవ స్వామి తన శిష్యుడైన ఆగస్త్యునికి శ్రీ లలితా త్రిశతి స్తోత్రాన్ని బోధిస్తాడు.

శ్రీ లలితా త్రిశతిస్తోత్రం దేవత యొక్క 300 మంత్రాలను (నామాలను) వివరిస్తుంది. మంత్ర స్వరూపమైన అమ్మరూపంలో మూడు భోగములు అనగా, మూడు కూటములున్నవి. అవి,

వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము. కూటము అనగా ఒక సమూహము అని అర్థం.
శ్రీ లలితా పరమేశ్వరి మంత్రమును శ్రీ విద్యా మంత్రమని చెప్ప బడింది. ఇది 15 అక్షరాల మహా మంత్రం. దీనినే పంచ దశ మహా మంత్ర మంటారు. ఈ 15 బీజాక్షరాల మహా మంత్రం 3 కూటములు గా ఉన్నది.

మొదటి భాగము ముఖము, అనగా శిరస్సు నుండి కంఠము వరకు; రెండవది కంఠము నుండి కటి వరకు; మూడవది కటి నుండి పాదాంగుష్టము వరకు ఉన్న భాగము.

మొదటి భాగం లో క, ఏ, ఈ, ల, హ్రీం అనే (5) బీజాక్షరాల తో ఉన్న కూటము. దీనినే వాగ్బవ కూటమంటారు.
రెండవ భాగములో హ, స, క, హ, ల, హ్రీం అనే (6) బీజాక్షరాల తో ఉన్న కూటము. దీనినే కామరాజ కూటమంటారు. మూడవ భాగంలో స, క, ల, హ్రీం అనే (4) బీజాక్షరాల తో ఉన్న కూటము. దీనినే శక్తి కూటమంటారు.

పంచ దశ మహ మంత్రానికి బీజాక్షరాలు 15. ఒక్కో బీజాక్షరానికి 20 మంత్రాల చొప్పున 15X20=300 మంత్రాలగును. ఇవే 300 నామాలు.
ఒక్కో కూటములో హ్రీం చివరి బీజాక్షరంగా ఉంటుంది. అనగా మూడు కూటములలో 3 హ్రీం బీజాక్షరాలు వస్తాయి.
ఒక్కో బీజానికి (20) మంత్రాలు ( నామాలు) చొప్పున మొత్తం (60) నామాలు.

వాస్తవానికి శ్రీ లలితా త్రిశతి, దేవీ ఖడ్గమాల మంత్రాలు ఉపదేశం ఉంటేనే పఠించాలి. ప్రస్తుతము చెప్ప బోయే హ్రీం బీజాక్షరం అర్థ నారీశ్వర తత్వమన్నమాట. అనగా కామేశ్వర, కామేశ్వరీ తత్వము. కనుక ఈ హ్రీం బీజాక్షరంలో ఉన్న నామాలు ఎవరైనా పఠించవచ్చును.

శనిగ్రహం ఖగోళంలో ప్రతి సంవత్సరం వక్ర గమనంలో ఉంటాడు. ఈ 2023 లో జూన్, 17 నుండి నవంబర్, 4 వరకు 140 రోజులు వక్ర గమన సంచారంలో అందరూ ఈ (60) నామాలను ఉదయం నుండి మధ్యాహ్నం లోగా పఠించాలి. అవకాశం లేకపోతే, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పాద ప్రక్షాళన చేసిన పిమ్మట భక్తితో పఠించాలి.

వాగ్భవ కూటము

ఓం హ్రీంకారరూపాయై నమః
ఓం హ్రీంకారనిలయాయై నమః
ఓం హ్రీంపదప్రియాయై నమః
ఓం హ్రీంకారబీజాయై నమః
ఓం హ్రీంకారమంత్రాయై నమః
ఓం హ్రీంకారలక్షణాయై నమః
ఓం హ్రీంకారజపసుప్రీతాయై నమః
ఓం హ్రీంమత్యై నమః
ఓం హ్రీంవిభూషణాయై నమః
ఓం హ్రీంశీలాయై నమః

ఓం హ్రీంపదారాధ్యాయై నమః
ఓం హ్రీంగర్భాయై నమః
ఓం హ్రీంపదాభిధాయై నమః
ఓం హ్రీంకారవాచ్యాయై నమః
ఓం హ్రీంకారపూజ్యాయై నమః
ఓం హ్రీంకారపీఠికాయై నమః
ఓం హ్రీంకారవేద్యాయై నమః
ఓం హ్రీంకారచింత్యాయై నమః
ఓం హ్రీం నమః
ఓం హ్రీంశరీరిణ్యై నమః

కామరాజ కూటము

ఓం హ్రీంకారిణ్యై నమః
ఓం హ్రీంకారాద్యాయై నమః
ఓం హ్రీంమధ్యాయై నమః
ఓం హ్రీంశిఖామణ్యై నమః
ఓం హ్రీంకారకుండాగ్నిశిఖాయై నమః
ఓం హ్రీంకారశశిచంద్రికాయై నమః
ఓం హ్రీంకారభాస్కరరుచ్యై నమః
ఓం హ్రీంకారాంభోదచంచలాయై నమః
ఓం హ్రీంకారకందాంకురికాయై నమః
ఓం హ్రీంకారైకపరాయణాయై నమః

ఓం హ్రీంకారదీర్ధికాహంస్యై నమః
ఓం హ్రీంకారోద్యానకేకిన్యై నమః
ఓం హ్రీంకారారణ్యహరిణ్యై నమః
ఓం హ్రీంకారావాలవల్లర్యై నమః
ఓం హ్రీంకారపంజరశుక్యై నమః
ఓం హ్రీంకారాంగణదీపికాయై నమః
ఓం హ్రీంకారకందరాసింహ్యై నమః
ఓం హ్రీంకారాంభోజభృంగికాయై నమః
ఓం హ్రీంకారసుమనోమాధ్వ్యై నమః
ఓం హ్రీంకారతరుమంజర్యై నమః

శక్తి కూటము

ఓం హ్రీంకారమూర్త్యై నమః
ఓం హ్రీంకారసౌధశృంగకపోతికాయై నమః
ఓం హ్రీంకారదుగ్ధబ్ధిసుధాయై నమః
ఓం హ్రీంకారకమలేందిరాయై నమః
ఓం హ్రీంకరమణిదీపార్చిషే నమః
ఓం హ్రీంకారతరుశారికాయై నమః
ఓం హ్రీంకారపేటకమణ్యై నమః
ఓం హ్రీంకారాదర్శబింబికాయై నమః
ఓం హ్రీంకారకోశాసిలతాయై నమః
ఓం హ్రీంకారాస్థాననర్తక్యై నమః

ఓం హ్రీంకారశుక్తికా ముక్తామణ్యై నమః
ఓం హ్రీంకారబోధితాయై నమః
ఓం హ్రీంకారమయసౌర్ణస్తంభవిదృమ పుత్రికాయై నమః
ఓం హ్రీంకారవేదోపనిషదే నమః
ఓం హ్రీంకారాధ్వరదక్షిణాయై నమః
ఓం హ్రీంకారనందనారామనవకల్పక వల్లర్యై నమః
ఓం హ్రీంకారహిమవద్గంగాయై నమః
ఓం హ్రీంకారార్ణవకౌస్తుభాయై నమః
ఓం హ్రీంకారమంత్రసర్వస్వాయై నమః
ఓం హ్రీంకారపరసౌఖ్యదాయై నమః

June 29, 2023 8 comments
5 FacebookTwitterPinterestEmail
Blogs

పితృ దోషం అదృష్టాన్ని తరిమివేస్తుంది

by gargeyaastro May 21, 2023
written by gargeyaastro

పొన్నలూరి శ్రీనివాస గార్గేయ, 9348632385

ముఖ్యంగా త్రిశక్తులలోని దేహ శక్తి, విద్యా శక్తి, ధన శక్తి అను మూడు శక్తిలకు అధిదేవతలు దుర్గా, సరస్వతి, లక్ష్మి. ఈ మూడు శక్తులు ప్రతి వ్యక్తికి ముఖ్యావసరము. ఈ మూడు శక్తులలో లగ్నం నుండి దేహ శక్తి, పంచమం నుండి విద్యా శక్తి. తొమ్మిదవ స్థానం నుంచి ధన శక్తి లభించును. ఈ తొమ్మిదవ స్థానాన్ని భాగ్య స్థానం అంటారు. లగ్న, పంచమ, నవమ స్థానాలను త్రికోణములు అంటారు. త్రి శక్తులకు మూలము త్రికోణములే.

సహజంగా జాతక కుండలిని పరిశీలించే సమయంలో నాల్గవ స్థానాన్ని బట్టి విద్య, ఉద్యోగము, ఆరోగ్య స్థితి గతులన్నీ తెలుస్తాయి. అలాగే లగ్నం నుంచి రెండవ స్థానాన్ని ధన, కుటుంబ స్థానం అంటారు. విద్యా స్థితిగతులు నాల్గవ స్థానం నుంచి, ధన వ్యవహారాలన్నీ రెండవ స్థానం నుంచి తెలుసుకోవచ్చును.

కానీ లగ్న, పంచమ, నవమ స్థానాలనే త్రికోణ స్థితి గతులను బట్టి కూడా మరింత అధికంగా యోగాలను, అవయోగాలను తెలుసుకోవచ్చును. త్రికోణాలలో భాగ్య కోణం అనగా తొమ్మిదవ స్థానాన్ని అదృష్ట స్థానము అంటారు. ఈ స్థానము దెబ్బతింటే ధన యోగము లేనట్టుగానే భావించాలి. ఇక్కడ అదృష్టము అనేది కేవలం డబ్బులు గురించి మాత్రమే కాదు, అదృష్టము అనేది ఏ రూపం నుంచి అయినా రావచ్చును.

ఈ నవమ కోణానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి దేవి. అందుచేతనే ప్రధానంగా భాగ్య స్థానమే ధన యోగమునకు మూలమైనది. జాతక చక్రంలో రెండవ స్థానంలో ధన విషయాలు తెలిసినప్పటికీ భాగ్య స్థానం నుంచి కూడా మరింత లోతుగా అదృష్ట యోగాన్ని పరిశీలించవచ్చు.

ఈ త్రికోణాలలో లగ్న కోణం కంటే పంచమ కోణము, పంచమ కోణం కంటే భాగ్య (అదృష్ట ) కోణం బలమైనవి. ఇట్టి నవమ స్థానమనే అదృష్ట స్థానాన్ని బట్టి అత్యధిక భాగం జాతకుల పరిస్థితులను, ప్రభావాలను తెలుసుకొనవచ్చును. ఈ స్థానం ఎంత గొప్పగా ఉంటేనే జాతకులు అంత బలీయంగా ఉంటారని చెప్పటంలో సందేహం లేదు.

అయితే నవమ స్థానంగా చెప్పబడే అదృష్ట స్థానం 95 శాతం మందికి పూర్తి స్థాయిలో రాణింపు లేకుండా ఉంటుంది. కేవలం 5 శాతం మందే మిగుల అదృష్టవంతులుగా ఉంటారు. ముఖ్యంగా జాతక చక్రంలో నవమ స్థానం కాకుండా ఇతర స్థానాలలో దొర్లినప్పుడు అనుకోకుండానే అదృష్ట స్థానం తక్షణమే దెబ్బతింటుంది. ఇలాంటి దోషాలను లెక్కిస్తే అనేకం ఉన్నాయి. ఈ అన్నీ దోషాలలోకెల్లా అదృష్ట స్థానాన్ని దెబ్బతీసే మొట్టమొదటి దోషమే పితృ దోషము.

పితృ కారక గ్రహమే రవి. ఈ రవికి పితృ దోషము ఏర్పడుతుంటుంది. జాతక చక్రంలో రవి ఏ స్థానంలో ఉన్ననూ, గొప్పగా బలీయంగా ఉన్ననూ… కొన్ని కొన్ని కారణాల వలన రవి పితృ దోషానికి లోనగును. ఎప్పుడైతే రవి (సూర్య గ్రహం) పితృ దోషానికి లోనగునో ఆ జాతకులకు అదృష్ట స్థాన ఉనికి దెబ్బతిన్నదని గమనించాలి. కొన్ని కొన్ని జాతకాలలో ఒక పితృ దోషం ఉండచ్చు, మరో పితృ దోషం ఉండచ్చు, ఇంకో పితృ దోషం కూడా ఉండచ్చు. అనగా ఒకటి కంటే అధికంగా కూడా పితృ దోషాలు వస్తుంటాయి.

ఒక వ్యక్తి జాతకంలో పితృ దోషం ఏర్పడినది చెప్పగానే, ఆ వ్యక్తి తండ్రి పాపాలు చేశాడని, లేదా ఆ వ్యక్తి కుటుంబంలో మరణించిన పెద్దలెవరైనా ఉంటే వారి ఆత్మలకు శాంతి కలుగని కారణం గానే పితృ దోషాలు వస్తుంటాయని అత్యధికులు భావిస్తుంటారు. ఈ మాట వాస్తవమే. కానీ ఈ రెండూ అంశాలు కాకుండా అదనంగా పితృ దోషాలను ఉత్పన్నం చేసే మరో 600 రకాల కాంబినేషన్లు కూడా జాతకాలలో ఉంటాయనే విషయం కొంత మందికే తెలుసు.

కేవలం తండ్రి పాపాలు చేసినందున మరణించిన పెద్దల ఆత్మల శాంతి కలిగినందున పితృ దోషాలు వస్తున్నాయని అనుకోరాదు. ఇతరంగా చెప్పబడే 600 కాంబినేషన్ల వలన కూడా పితృ దోషాలు ఏర్పడి అదృష్ట స్థానం ఉనికిని కోల్పోయి, ఆ వ్యక్తి విజయ పరంపరలో ఉండక నిర్భాగ్యంతో ఉండటం ఎంతో మంది జాతకాలలో చూస్తుంటాం.

ఉదాహరణకు భారత దేశంలో ధీరూభాయ్ అంబానీని గురించి తెలియని వారుండరు. వీరికి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు కుమారులు. ఈ ఇరువురికీ తండ్రి ఆస్తి పాస్తులు సమానంగా వచినప్పటికీ పెద్ద వాడుగా ఉన్న ముఖేష్ అంబానికి ఉన్న అదృష్ట జాతకంతో దిన దిన ప్రవర్ధమానమై ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో చేరిపోగా, రెండవ కుమారుడుగా ఉన్న అనిల్ అంబానీకి అదృష్ట స్థానం ఉనికి కోల్పోవటంతో.. తాను చేపట్టిన వ్యాపారాలన్నీ క్రమ క్రమంగా నష్టాల ఊబిలోకి చేరిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది తమ తమ జాతకాలలో పితృ దోషం వలన అదృష్ట స్థానం యోగాన్ని కోల్పోతున్నారు.

ఇక్కడ అదృష్టం అనగానే వెంటనే ధనంతోనే ముడిపడదు. విద్య, ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము, గృహము, బుద్ధిబలం, జ్ఞాన బలము, వివాహము, దాంపత్య జీవితమూ, సంతానం, ఆయుర్భలము మొదలైన ఎన్నో విధాలుగా అదృష్టం ముడిపడి ఉంటుంది. ఎప్పుడైతే పితృదోషం జాతకంలో ఉంటె అదృష్ట యోగం వ్యక్తి నుంచి దూరం అవుతుంటుంది.

మరి పితృ దోషాలు ఉండేవారికి అదృష్ట యోగం ఏ ఏ వయసులలో దూరమవుతుంది, ఏ ఏ కాంబినేషన్లు ఉంటె అదృష్ట యోగం తొంగి చూడదు అనే అంశాలపై అంచలంచలుగా పూర్తి వివరాలను తెలుసుకుందాం. అలాగే జాతక సరళిలో పితృ దోషాలు ఉన్నప్పుడు, వాటి ప్రభావం అదృష్ట స్థానంపై ఉండకుండా ఉండాలంటే ఏ విధమైన పరిహారాలు చేయాలి అనే అంశంపై కూడా దీర్ఘంగా చెప్పుకుందాం. ఈ పరిహారాలు స్వల్ప కాలమే చేయాలా లేక దీర్ఘ కాలం చేయాలా అనేది… ఆయా జాతక చక్రాలపై ఆధారపడి ఉంటుంది. వీటన్నింటినీ https://www.gargeyaastro.com వెబ్సైటు లో సర్వులకూ అర్థమయ్యేలాగా ఇవ్వటానికి ప్రయత్నిస్తాను.

May 21, 2023 4 comments
0 FacebookTwitterPinterestEmail
Blogs

పంచాంగంలో ఆదాయ వ్యయ నిర్ణయం ఖచ్చితమేనా….?

by gargeyaastro March 16, 2023
written by gargeyaastro

సాధారణంగా ఉగాది రాగానే అందరూ పంచాంగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాశి ఫలాలు ఎలా ఉన్నా… ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయన్న ఉత్కంఠే అందరిలో ఎక్కువ. ఆదాయం 14 వ్యయం 2 ఉందనుకోండి…. సంబరపడిపోతారు. అదే ఆదాయం 2 వ్యయం 14 ఉందనుకోండి చతికిలపడిపోతారు.

ఇక్కడే ఒక సంచలనాత్మకమైన విషయాన్ని మీతో పంచుకోబోతున్నా. నా 40 సంవత్సరాలు దాటిన‌ సుదీర్ఘ జ్యోతిష శాస్త్ర అనుభవంతో నేను తెలుసుకున్న సంచలనాత్మక అంశం ఇది.
పంచాంగంలో వచ్చే ఆదాయ-వ్యయ నిర్ణయాలు ఖచ్చితమైనవి కావు. జ్యోతిషశాస్త్ర ప్రామాణిక‌ గ్రంధాలు పేర్కొన్న‌ ప్రకారం ఉగాది పర్వదినం వచ్చిన‌ వారాన్నిబట్టి ఆదాయ- వ్యయ నిర్ణయాలు జరుగుతాయి. ఉదాహరణకు ఆదివారం ఉగాది వస్తే…. ఒక్కో రాశికి ఆదాయం ఇంత, వ్యయం ఇంత అని ఉంటుంది. సోమవారం ఉగాది వస్తే మరోలా…. మంగళవారం ఉగాది వస్తే ఇంకోలా….. అదే విధంగా బుధ…. గురు…. శుక్ర…. శని వారాలకి కూడా స్థిరమైన సంఖ్యా నిర్ణయాలున్నాయి. అయితే ఈ నిర్ణయాలన్నీ వారాలను బట్టి చేశారే తప్ప, ఆ సంవత్సరంలో ఉండే వ్యతిరేక గ్రహస్థితులు… అనుకూల గ్రహస్థితులను బట్టి చేయలేదు. ఒక్కో సంవత్సరంలో అధిక గ్రహణాలు, చతుర్గ్రహ…. పంచగ్రహ….. షట్గ్రహ కూటములూ ….. పాప, శతృగ్రహ సంఘర్షణలూ ఎన్నో ఉంటాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఒక్కో రాశికీ ఆయా గ్రహస్థితులను బట్టి ఎంత ఆదాయం‌ ఉంటుంది….. ఎంత వ్యయం ఉంటుందీ నిర్థారించాలి. మరికొన్నిసార్లు కాలసర్పయోగాలు …… గురుఛండాల యోగాలు …. నాగదోషాలు ఇత్యాదులు ఎన్నో ఉంటుంటాయి. రెండు సంవత్సరాల క్రితం ఒకే సంవత్సరంలో వచ్చిన పలు కాలసర్పయోగాల కారణంగా కరోనాతో ప్రపంచం అంతా అతలాకుతలమైపోయింది.

మరి ఇలాంటి దారుణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆదాయ – వ్యయాలను కేవలం‌ ఉగాది వచ్చిన వారాన్ని బట్టి నిర్ణయించడం అనేది ముమ్మాటికీ తప్పే. మార్కెట్ లో వస్తువులకు నిర్ణీతధర(ఫిక్స్ డ్ రేట్) లాగా ఆదాయ – వ్యయ నిర్ణయం చేయడం అసంబద్ధం, అనుచితం‌ కూడా. నేనిలా చెప్పడం నా తోటి పంచాంగకర్తలందరికీ తీవ్ర ఆగ్రహాన్ని, అసౌకర్యాన్ని కలుగచేస్తుందని‌ నాకు తెలుసు. పంచాంగ, జ్యోతిష శాస్త్ర నిర్ణయాలను ఎంత కఠినమైనా నిక్కచ్చిగా చేసే నేను… ప్రతి ఉగాదికీ ఈ అంశాన్ని మీ ముందుకు తేవాలని మథనపడుతూనే ఉన్నాను. ఈ అంశాన్ని‌ వెల్లడించడం‌ వల్ల కలిగే కష్టనష్టాలు ఎలాగైనా వుండనీయండి…. ఈ కఠోర నిజాన్ని నా పాఠకులకు, ప్రణతీ టెలివిజన్ ప్రేక్షకులకు చెప్పితీరాలనే కఠిన నిర్ణయంతోనే మీ ముందుకు వచ్చాను.

వ్యక్తిగత జాతకంతో మీరందరూ నన్ను సంప్రదించాలనే నేనిలాంటి అంశాన్ని బహిర్గతం చేస్తున్నానని చాలామంది విమర్శించవచ్చు. అది సబబు కాదు. ఓ కఠినమైన‌ నిజాన్ని అందరితో పంచుకోవాలన్నదే నా ప్రధాన లక్ష్యం. పంచాంగాలలో కనిపించే ఆదాయ – వ్యయ పట్టికలను చూసి భయపడకండి. దైవాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి…ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీదే. కొన్ని లక్షలమందికి ఒకే రాశి ఉండవచ్చు. ఆ రాశికి చెప్పే ఫలితాలు అందరికీ ఒకేలా ఉంటాయా అంటే…. ఉండకపోవచ్చు. చాలా వరకు వ్యక్తిగత జాతకాన్ని బట్టి, ఆ జాతకంలో ఉండే గ్రహస్థితులను బట్టి రాశి ఫలితాలు మారే అవకాశం చాలా ఉంటుంది. అందువల్ల ఆందోళన చెందకుండా చిన్న చిన్న‌ పరిహారాలు చేసుకుంటూ సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.

March 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Blogs

25 October 2022 Surya Grahana Timings | సూర్యగ్రహణ సమయాలు

by gargeyaastro October 22, 2022
written by gargeyaastro

25 అక్టోబర్ 2022 మంగళవారం ఆశ్వయుజ అమావాస్యరోజు ఖగోళంలో మధ్యాహ్నం 2 గంటల 28 నిముషములకు సూర్యగ్రహణస్పర్శ మొదలగును. గ్రహణ మధ్యకాలం సాయంకాలం 4 గంటల 18 నిముషాలు. గ్రహణ మోక్షకాలం సా 6 గంటల 32 నిముషములు.
ఇది పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే. ఈ దిగువ ప్రాంతాలలో ఉదహరించిన సమయాలలో మాత్రమే సూర్యగ్రహణం గోచరించును.

విజయవాడ సా5.03 – సా5.42
హైదరాబాద్ సా4.59 – సా5.48
రాజమండ్రి సా5.02 – సా5.35
కాకినాడ సా5.03 – సా5.33
విశాఖపట్నం సా5.01 – సా5.28
విజయనగరం సా5.01 – సా5.30
అన్నవరం సా5.02 – సా5.32
అమలాపురం సా5.02 – సా5.31
పాలకొల్లు సా5.04 – సా5.36
తణుకు సా4.58 – సా5.27
నర్సాపురం సా4.54 – సా5.46
తాడేపల్లిగూడెం సా5.03 – సా5.36
ఏలూరు సా5.03 – సా5.38
గుంటూరు సా5.03 – సా5.41
తెనాలి సా5.04 – సా5.40
చీరాల సా5.05 – సా5.42
ఒంగోలు సా5.06 – సా5.43
నెల్లూరు సా5.09 – సా05.44
సూళ్ళూరుపేట సా5.11 – సా5.45
తిరుపతి సా5.11 – సా5.47
తిరుమల సా5.11 – సా5.48
చిత్తూరు సా5.12 – సా5.49
కడప సా5.08 – సా5.49
కర్నూలు సా5.03 – సా5.51
అనంతపూర్ సా5.06 – సా5.54
హిందూపూర్ సా5.09 – సా5.55
శ్రీశైలం సా5.03 – సా5.47
నల్గొండ సా5.00 – సా5.45
వినుకొండ సా5.04 – సా5.44
మిర్యాలగూడ సా5.01 – సా5.44
సూర్యాపేట సా5.00 – సా5.43
వరంగల్ సా4.58 – సా5.43
మెదక్ సా4.57 – సా5.48
కరీంనగర్ సా4.56 – సా5.44
మహబూబ్ నగర్ సా5.00 – సా5.50
భద్రాచలం సా5.00 – సా5.38
ఖమ్మం సా5.00 – సా5.41
యాదాద్రి సా4.59 – సా5.46
మంచిర్యాల సా4.55 – సా5.43
సిద్ధిపేట సా4.56 – సా5.42
నిజామాబాద్ సా4.55 – సా5.48
ఆదిలాబాద్ సా4.52 – సా5.45
షిర్డీ సా4.48 – సా6.01
మద్రాస్ సా5.14 – సా5.44
బెంగళూరు సా5.12 – సా5.55
బొంబాయి సా4.49 – సా6.09
ఢిల్లీ సా4.29 – సా5.42
కలకత్తా సా4.52 – సా5.03
పూనె సా4.51 – సా6.05
అహ్మదాబాద్ సా4.38 – సా6.06
భువనేశ్వర్ సా4.56 – సా5.16
పాట్నా సా4.42 – సా5.13
లక్నో సా4.36 – సా5.29
రామేశ్వరం సా5.28 – సా5.52
మంగుళూర్ సా5.10 – సా6.06
మైసూరు సా5.13 – సా6.00
కాంచీపురం సా5.14 – సా5.47
శృంగేరి సా5.08 – సా6.04
మధురై సా5.24 – సా5.56
సూరత్ సా4.43 – సా6.07
వారణాసి సా4.41 – సా5.22
ఇండోర్ సా4.42 – సా5.53
భోపాల్ సా4.42 – సా5.46
ఉజ్జయని సా4.41 – సా5.53

October 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts
  • About
  • Contact Us
  • Our Services
  • Blog
  • Nitya Panchangam
  • Photo Gallery
  • YouTube
  • Store

Copyright © 2024 Gargeya Astro | All Rights Reserved.

Gargeya Astro
  • Home
  • About
  • Our Services
  • Nitya Panchangam
  • Blog
  • Gallery
  • Store
    • Kalayogam Prime
    • Kalayogam Mini
    • 2022 Calendars
  • Youtube
  • Contact Us