హిందూ సనాతన ధర్మంలో వేప వృక్షానికున్న ప్రాధాన్యం అత్యంత విశేషమైనది.ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో, అట్టి వారు ఆరోగ్యవంతంగా అధిక కాలం జీవిస్తారని ప్రాచీన ఆయుర్వేద గ్రంధంలో చరకుడు తెలియచేశాడు. వేపచెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా వైద్య శాస్త్రం అభివర్ణిస్తుంటే భారతీయ పురాణాలు వేపచెట్టును ఓ లక్ష్మీ దేవిగా భావిస్తారు. చాంద్రమానం ప్రకారంగా చైత్ర శుక్ల పాడ్యమి తిథి ఉగాది పండుగతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఆనాడు తైలాభ్యంగనము తదుపరి వేప పూత పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇట్టి వేప చెట్టుతో అనేక ఆధ్యాత్మిక పరంగా ఎన్నెన్నో అద్భుత రహస్యాలు ఉన్నట్లుగా తంత్రశాస్త్ర గ్రంధాలు పేర్కొంటున్నాయి. అలాంటి వాటిలో లక్ష్మి దేవి అనుగ్రహ ప్రాప్తికి శుక్రవారం రాహుకాలంలో ఆచరించే ఓ అద్భుతమైన ప్రక్రియను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం.

– దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ
2 comments
Guruvu gariki namskaram meeru thelipe chinna chinna remidies entho vupayogakram erojulo
మీ పంచాంగం లేక ఇబ్బంది పడుతున్నాము